Karnataka IAS Vs IPS Fight: కర్ణాటకలో ఇద్దర మహిళా సివిల్ సర్వెంట్ల ఇష్యూ కొనసాగుతూనే ఉంది. ఫేస్ బుక్ వేదికగా ఐపీఎస్ రూపా మౌడ్గిల్, ఐఏఎస్ రోహిణి సింధూరి ఫోటోలను షేర్ చేసి, పలు విమర్శలు చేసింది. ఇదిలా ఉంటే ఈ ఇద్దరిని కర్ణాటక ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వకుండా బదిలీ చేసింది. ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మైతో పాటు ప్రభుత్వం అంతా ఈ విషయంపై ఆగ్రహంతో ఉంది. సోషల్ మీడియా వేదికగా, బహిరంగంగా ఎలాంటి విమర్శలు చేసుకోవద్దని ఇద్దరిని హెచ్చరించారు సీఎస్ వందితా శర్మ.
Read Also: Maternal Mortality: ప్రతీ రెండు నిమిషాలకు ఓ తల్లి మరణిస్తోంది.. యూఎన్ రిపోర్ట్..
ఇదిలా ఉంటే ప్రభుత్వం, సీఎస్ హెచ్చరికలను పట్టించుకోకుండా బుధవారం రూపా మరోసారి ఫేస్ బుక్ వేదికగా ఓ పోస్టును పెట్టారు. తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు పోరాడుతున్నా అని అన్నారు. ఇదిలా ఉంటే ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. తనపై విమర్శలు చేసిన ఐపీఎస్ రూపా మౌడ్గిల్ కు లీగల్ నోటీసులు పంపించారు రోహిణి సింధూరి. తనను మానసిక క్షోభకు గురిచేసిన, పరువు పోయేలా విమర్శలు చేసిన రూపా తనకు రాతపూర్వకంగా క్షమాపణలతో పాటు రూ. 1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూపా చేసిన వ్యాఖ్యలు తన క్లయింట్, ఆమె కుటుంబ సభ్యలను మానసిక వేధనకు గురిచేశాయని, వృత్తిపరంగా, వ్యక్తిగతంగా, సామాజిక జీవితంలో రోహిణి ఇమేజ్ నాశనం, రూపా ప్రవర్తన మూలంగా తన క్లయింట్ అయిన రోహిణి నిద్రలేని రాత్రులను గడుపుతున్నారని.. ఈ అంశం బ్యూరోక్రాట్ సర్కిళ్లలో చర్చనీయాంశం అయిందని నోటీసుల్లో పేర్కొన్నారు.
రూపా, రోహిణి సింధూరి గురించి ఫేస్ బుక్ లో పోస్టు చేయడంతో వివాదం మొదలైంది. రోహిణి సివల్ సర్వీస్ మార్గదర్శకాలను ఉల్లంఘించారని, పలు అక్రమాలకు పాల్పడ్డారంటూ విమర్శించింది. దీనిపై స్పందించిన రోహిణి, ఆమె మానసిక స్థితి బాగా లేదని అన్నారు. ఇదిలా ఉంటే బుధవారం రూపా మరో పోస్టు పెట్టారు. దయచేసి రోహిణి సింధూరి ఐఎఎస్‌పై నేను లేవనెత్తిన అవినీతి సమస్యపై దృష్టి పెట్టండి.. అతి సామాన్యులను ప్రభావితం చేసే అవినీతికి వ్యతిరేకంగా పోరాడకుండా నేను ఎవరినీ నిరోధించలేదని అన్నారు. నేను, నా భర్త ఇంకా కలిసి ఉన్నామని, కుటుంబాన్ని చెక్కుచెదరకుండా ఉంచడానికి మేము ఇంకా పోరాడుతున్నామని ఎఫ్బీ పోస్టులో రూపా రాసుకొచ్చారు.