AIADMK: అన్నాడీఎంకే పళనిస్వామిదే.. పన్నీర్ సెల్వానికి సుప్రీంకోర్టు షాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AIADMK Leadership row: తమిళనాడు రాజకీయ పార్టీ ఏఐడీఎంకే పార్టీ చీఫ్ గా పళనిస్వామి ఉంటారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి ఉంటారని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. అన్నాడీఎంకే పార్టీపై తన అధిపత్యాన్ని నిలుపుకోవడానికి పన్నీర్ సెల్వం చేసిన ప్రయత్నాలకు బ్రేక్ వేసింది. మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఓ పన్నీర్ సెల్వం (ఓపీఎస్) వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
సుప్రీంకోర్టు నిర్ణయంతో పళనిస్వామి వర్గం సంబరాల్లో మునిగిపోయారు. విజయ సంకేతం చూపిస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. గత ఏడాది జూలై 11న జరిగిన అన్నాడీఎంకే జనరల్ కమిటీ సమావేశంలో ఎడప్పాడి పళనిస్వామిని పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నిక చెల్లదంటూ ఓ.పన్నీర్‌సెల్వం, జనరల్ కమిటీ సభ్యుడు వైరముత్తు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి ఈ కేసులో ఈ ఎన్నిక చెల్లదని తీర్పు చెప్పారు. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ పళనిస్వామి వర్గం హైకోర్టులో అప్పీల్ చేసింది. ఈ కేసును విచారించిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం సింగిల్ జడ్డి తీర్పుపై స్టే విధిస్తూ పళని స్వామి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేస్తూ తీర్పు ఇచ్చింది.
Also Read
- Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు? విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలివే!
- September 2026 Salary Update: కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ జీతం, పెన్షన్ రేపే ఖాతాల్లోకి!
- Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
దీన్ని వ్యతిరేకిస్తూ పన్నీర్ సెల్వం సుప్రీంకోర్టలో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు విచారణలో సుప్రీంకోర్టు నిర్ణయంతో అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక జనరల్ సెక్రటరీగా పళనిస్వామి కొనసాగేందుకు అనుమతి ఇచ్చింది.
తాజావార్తలు
-
Hashmi – Himesh : 20 ఏళ్ల తర్వాత ఇమ్రాన్ హష్మీ, హిమేష్ రేష్మియా రీ యూనియన్
-
Madras Regiment Arms Theft Case: బొల్లారం మద్రాసు రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
Iran Trolls Trump: ట్రంప్‌ను టీజ్ చేసిన ఇరాన్.. బాలయ్య ‘భగవంత్ కేసరి’ క్లిప్‌తో కౌంటర్
-
Budameru Floods: బుడమేరులో పెరిగిన వరద ఉద్ధృతి.. అప్రమత్తమైన అధికారులు..
ట్రెండింగ్
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!