Pakistan Economic Crisis: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో సతమతం అవుతున్న దాయాది దేశం పాకిస్తాన్ బయటపడేందుకు అనేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అప్పుకోసం అనేక పన్నులు విధించిన ఆ దేశం ఇప్పుడు ఖర్చులను తగ్గించుకునే పనిలో ఉంది. తాజాగా మంత్రుల, సలహాదారుల అలవెన్సులు, ప్రయాణ ఖర్చులను తగ్గించనున్నట్లు ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. అనని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ కార్యాలయాల ఖర్చులను 15 శాతం తగ్గించాలని ఆదేశించామని, జీతాలు, అలవెన్సులు, లగ్జరీ కార్లు, విదేశీ పర్యటనలు, బిజినెస్ క్లాస్ ప్రయాణాలు విరమించుకోవాలని కోరినట్లు ప్రధాని వెల్లడించారు. దీని వల్ల 766 మిలియన్ డాలర్లు ఆదా అవుతాయని ఆయన అన్నారు.
Read Also: Karnataka: ఐపీఎస్ రూపా మరో సంచలన పోస్ట్.. నా కుటుంబాన్ని కాపాడుకునేందుకే అంటూ..
దీంతో పాటు పాకిస్తాన్ లో అత్యంత కీలకంగా ఉండే నిఘా సంస్థ ఐఎస్ఐ తో పాటు ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)కి ఇచ్చే నిధులపై పరిమిత విధించింది. దీంతో పాటు కొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇక ఉచిత విద్యుత్ ఉండబోదు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకంపై నిషేధం, మూడేళ్లుగా భర్తీ కాకుండా ఉన్న పోస్టులను తొలగిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం, ఐఎంఎఫ్ బెయిలౌట్ ప్యాకేజీ కోసం చూస్తోంది. ఐఎంఎఫ్ సూచించిన పలు షరతులను కూడా అంగీకరిస్తోంది. ఇప్పటికే దేశంలో పన్నులను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా విదేశాల నుంచి దిగుమతి అయ్యే లగ్జరీ గూడ్స్ పై పన్ను పెంచింది. విద్యుత్ సబ్సిడీలు ఎత్తేయడంతో పాటు టారిఫ్ పెంచడం, పెట్రోల్, డిజిల్ రేట్లను పెంచడవం వంటివి చేస్తోంది.