Joe Biden: రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపధ్యంలో సోమవారం అమెరికా అధ్యక్షుడు ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో పర్యటించారు. అధ్యక్షుడు జెలన్ స్కీతో సమావేశం అయ్యారు. ఉక్రెయిన్ కు అమెరికా మద్దతు ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. అయితే దీనిపై రష్యా మండిపడింది. యుద్ధానికి కారణం పాశ్చత్య దేశాలే అని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ స్వార్థానికి ఉక్రెయిన్, రష్యాలను బలిపశువు చేశారంటూ మండిపడ్డారు. ఈ నేపధ్యంలో రష్యా, అమెరికాల మధ్య చివరిసారిగా కుదిరిన అణు ఒప్పందం ‘న్యూ స్టార్ట్’ నుంచి…
Bill Gates: మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భారత్ పై ప్రశంసల జల్లు కురిపించారు. తన బ్లాగ్ ‘‘గేట్స్ నోట్స్’’లో భారత్ సాధిస్తున్న విజయాలను గురించి ప్రస్తావించారు. ప్రపంచం అనేక సంక్షోభాలను ఎదుర్కొంటున్న సమయంలో కూడా భారత్ భవిష్యత్తుపై ఆశ కల్పిస్తోందని అన్నారు. దేశం పెద్ద సమస్యలను ఒకేసారి పరిష్కరించగలదని నిరూపించిందని ఆయన అన్నారు. భారత్ సాధించిన అద్బుతమైన పురోగతికి మించిన రుజువు లేదని పేర్కొన్నారు.
Venus and Jupiter, Moon conjunction: ఆకాశంలో అద్భుతం చోటు చేసుకోనుంది. గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతున్న సమయంలో ఒకానొక సందర్భంలో ఒకే సరళరేఖలోకి వస్తుంటాయి. వీటిని ప్లానెటరీ కంజెంక్షన్ (గ్రహాల సంయోగం)గా అభివర్ణిస్తుంటాం. తాజాగా శుక్రుడు, గురుడు, చంద్రుడు ఒకే చోటుకు రాబోతున్నారు. నిజానికి ఈ మూడు గ్రహాల మధ్య మిలియన్ కిలోమీటర్ల దూరం ఉన్నా.. ఆకాశంలోకి చూసేటప్పుడు ఇవి ఒకదానితో ఒకటి కలిసిపోయినట్లు, లేదా పక్కపక్కన ఉన్నట్లు కనిపిస్తుంటాయి. జ్యోతిష్యపరంగా కూడా ఇలాంటి గ్రహాల సంయోగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది.
Mallikarjun Kharge: 2024 ఎన్నికల్లో బీజేపీని గద్దె దించుతామని, కాంగ్రెస్ ప్రతిపక్ష కూటమికి నేతృత్వం వహిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. భావసారుప్యం ఉన్న పార్టీలతో చర్చ జరుగుతోందని ఆయన వెల్లడించారు. ప్రధాని మోదీ అనేక సార్లు దేశాన్ని ఎదుర్కొనే ఏకైక వ్యక్తిని నేను, ఇతర వ్యక్తులు నన్ను తాకలేరని అన్నారని, ప్రజాస్వామ్యవాది ఎవరూ ఇలా అనరని, మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారు, నియంత కాదని గుర్తుంచుకోవాలని సూచించారు. మీరు ప్రజలతో ఎన్నుకయ్యారు, వారే మీకు తగిన గుణపాఠం చెబుతారని నాగాలాండ్ లో…
Couple Found Dead: కొత్తగా పెళ్లైన జంట నిండు నూరేళ్లు కలిసి జీవించాల్సి వాళ్లు కానీ, పెళ్లైన తర్వాత రిసెప్షన్ ముందే చనిపోయారు. కత్తిపోట్లకు గురై మరణించినట్లు పోలీస్ విచారణలో తేలింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో జరిగింది. ఇద్దరు దంపతులు తమ ఇంట్లోని ఓ గదిలో తీవ్రగాయాలతో శవాలపై కనిపించారు.
Sanjay Raut Claims Threat To Life: ఉద్ధవ్ ఠాక్రే వర్గం నేత ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపనలు చేశారు. ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే కుమారుడి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. లోక్ సభ ఎంపీ శ్రీకాంత్ షిండే(ఏక్ నాథ్ షిండే కుమారుడు) నన్ను చంపేందుకు థానేకు చెందిన నేరస్థుడు రాజా ఠాకూర్‌కు సుపారీ ఇచ్చాడని..బాధ్యత కలిగిన పౌరుడిగా మీకు తెలియజేస్తున్నా అని పోలీసులకు లేఖ రాశారు. అయితే సంజయ్ రౌత్ ఆరోపనలను అధికార పార్టీ తోసిపుచ్చింది. ఇది చౌకబారు…
Earthquake: టర్కీలో భారీ భూకంపం ఆ దేశాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. టర్కీతో పాటు సిరియాతో కలిపి ఇప్పటి వరకు 47 వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే మనదేశంలో కూడా ఇలాంటి భూకంపం తప్పదని చాలా మంది భూకంప శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా హిమాలయ రాష్ట్రాలు ఎక్కువ రిస్క్ జోన్ లో ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో త్వరలోనే భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందని ప్రముఖ శాస్త్రవేత్త, భూకంప…
Neha Singh Rathore: ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ లో ఓ పాట తెగ వైరల్ అవుతోంది. ప్రముఖ భోజ్ పురి సింగర్ నేహా సింగ్ రాథోడ్ పాడిన పాటపై యూపీ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇటీవల కాన్పూర్ లో అక్రమ ఇళ్లను తొలగింపు తల్లీకూతుళ్లు మరణానికి కారణం అయింది. అయితే ఈ ఘటనపై ప్రభుత్వాన్ని హేళన చేస్తూ నేహా సింగ్ ‘‘ యూపీ మే కా బా’’ అంటూ ఓ సాంగ్ వీడియోను యూట్యూబ్, ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. అయితే…
Air India: ఎయిరిండియా అంతర్జాతీయ విమానంలో మరోసారి సాంకేతిక సమస్య ఏర్పడింది. నెవార్క్ నుంచి న్యూఢిల్లీ వస్తున్న విమానాం స్వీడన్ లోని స్టాక్ హోమ్ కి మళ్లించారు. బోయింగ్ 777-300ఈఆర్ విమానంలోని ఒక ఇంజిన్ లో ఆయిల్ లీక్ కావడంతో సాంకేతిక సమస్య తలెత్తిందని డీజీసీఏ వెల్లడించింది.
Elgar Parishad Case: ఎల్గార్ పరిషత్, మావోయిస్టు సంబంధాల కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. హక్కుల కార్యకర్త గౌతమ్ నవ్లాఖాకు పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) తెలిపింది. అతని బెయిల్ దరఖాస్తును వ్యతిరేకిస్తూ బాంబే హైకోర్టుకు తెలిపింది. నవ్లాఖా జాతీయ భద్రత, ఐక్యత, సార్వభౌమాధికారంపై ప్రభావం చూపేలా పలు చర్యలకు పాల్పడ్డారని ఎన్ఐఏ కోర్టుకు తెలిపింది. నవ్లాఖా బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్ ను ఎన్ఐఏ న్యాయవాది సందేశ్ పాటిల్ సోమవారం జస్టిస్ ఎఎస్ గడ్కరీ,…