Swara Bhasker Marriage: స్వరాభాస్కర్ పెళ్లిపై ఇంకా విమర్శలు, వివాదాస్పద వ్యాఖ్యలు వస్తూనే ఉన్నాయి. ఇటు హిందూ నేతలు, అటు ముస్లిం గురువులు ఆమె వివాహంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అయోధ్య మహంత్ రాజు దాస్, స్వరాభాస్కర్ ఓ ముస్లింను వివాహం చేసుకోవడంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్వరా భాస్కర్ సాధికారిత కలిగిన మహిళ అయితే ముందు ఆమె పెళ్లి చేసుకోకుండా ఉండాల్సిందని అన్నారు. ఆమె 1000 మంది పురుషులతో రాత్రులు గడపాలని అనుకుంటే ఆమెకు అభినందనలు అని, ఎందుకంటే ఆమె అన్నాచెల్లిళ్లు పెళ్లి చేసుకునే కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నారని, ట్రిపుల్ తలాక్ ఇచ్చే సమాజంలోని వ్యక్తిని పెళ్లి చేసుకుందని, ట్రిపుల్ తలాక్ తరువాత ఆమె చాలా మంది పురుషులతో గడపాల్సి వస్తుందంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
Read Also:Pakistan: మంత్రుల ఖర్చులు, ఐఎస్ఐ నిధుల్లో కోత.. ఆర్థిక సంక్షోభం నుంచి బయపడేందుకు పాక్ చర్యలు..
స్వరా భాస్కర్, ఫహాద్ అహ్మద్ వివాహం గురించి మాట్లాడుతూ.. 10 రోజుల క్రితం స్వరాభాస్కర్ భాయ్ అని సంభోధిస్తూ ఓ మంచి అమ్మాయిని పెళ్లి చేసుకో అని చెప్పింది.. తర్వాత అతడినే పెళ్లి చేసుకుంది. అని ఆయోధ్య మహంత్ విమర్శించారు. ఆమె బహిరంగంగా ఇన్షా అల్లాహ్, భారత్ తేరే తుక్డే హోంగే అని నినాదాలు చేసిందని అన్నారు. మహంత్ రాజు దాస్ మాట్లాడుతూ నేను ఏ స్త్రీని లేదా ఏ మతాన్ని అవమానించకూడదని అనుకుంటున్నానని.. గతంలో హిందూమతంలో సతీ ఆచారం ఉండేదని.. కాని ఇప్పుడు లేదని, ఇస్లాంలో కూడా ‘హలాలా’ అనేది ఇంకా ఉందని, ఓ స్త్రీ సోదరుడు, తండ్రి, గురువుతో మంచం పంచుకోవాల్సి వస్తోందని, అలాంటి వారిని ఆ బాధ గురించి అడగండి, ఇలాంటి సంస్కృతి నరకానికి వెళ్లాలని అన్నారు.
ఇదిలా ఉంటే ఓ రోజు ముందు విహెచ్పీ నాయకురాలు సాధ్వీ ప్రాచీ, స్వరాభాస్కర్ ను ఉద్దేశిస్తూ ఢిల్లీలో శ్రద్ధా వాకర్ కు పట్టిన గతే స్వరా భాస్కర్ కు పడుతుందని, స్వరా భాస్కర్ ముందుగా ఫ్రిజ్ చూడాల్సి ఉందని ఆమె ఎద్దేవా చేశారు. చికాగోకు చెందిన ఓ ముస్లిం స్కాలర్ వీరిద్దరి పెళ్లి లీగల్ కానీ, ఇస్లామిక్ కాదని అన్నారు. విగ్రహారాధన చేసే స్త్రీతో వివాహాన్ని అల్లా అంగీకరించడని అన్నారు.