Pawan Khera Arrest: కాంగ్రెస్ లీడర్ పవన్ ఖేరాని విమానం నుంచి దించి.. అరెస్ట్ చేసిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Khera Arrest: కాంగ్రెస్ లీడర్ పవన్ ఖేరాని విమానం నుంచి దింపేసిన తర్వాత అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. గురువారం ఉదయం ఢిల్లీ నుంచి ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌కు వెళ్లేందుకు బయలుదేరిన పవన్ ఖేరాను విమానం నుంచి దింపేశారు అధికారులు. పార్టీ నేతలతో కలిసి విమానం ఎక్కిన కొద్ది సేపటికే ఆయనను అధికారులు అడ్డగించారు. రాయ్ పూర్ లో జరిగే కాంగ్రెస్ ప్లీనరీ సమావేశానికి ఆయన వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
Read Also: Supreme Court : అమరావతిపై సుప్రీంకోర్టులో విచారణ మళ్లీ వాయిదా
Also Read
- UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
- Smit Machchhar & Sandra Samuel: అప్పట్లో సాండ్రా శామ్యూల్, ఇప్పుడు స్మిత్ మచ్ఛార్..
- UPSC Centenary 2026: UPSC శతాబ్ది వేడుకలు.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వందేళ్ల చరిత్ర ఇదే
- CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
అరెస్ట్ వారెంట్ లేకుండానే పవన్ ఖేరాను ఆపారని కాంగ్రెస్ ఆరోపించింది. బీజేపీ కావాలనే కాంగ్రెస్ నేతలపై బలప్రయోగం చేస్తోందని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. పవన్ ఖేరాను ఢిల్లీ-రాయ్‌పూర్ ఫ్లైట్ నుండి దింపి, ఏఐసిసి ప్లీనరీకి రాకుండా చేయడం ద్వారా మోడీ ప్రభుత్వం గూండాల వ్యవహరిస్తోందని, అతడిని అడ్డుకోవడం సిగ్గు చేటని, పార్టీ మొత్తం పవన్ ఖేరాకు అండగా నిలుస్తుందని పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ట్వీట్ చేశారు. ముందుగా ఈడీని చత్తీస్ గఢ్ పంపారని, ఇప్పుడు కాంగ్రెస్ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్తున్న పవన్ ఖేరాను ఫ్లైట్ ఎక్కకుండా ఆపారని.. ఈ నియంతృత్వాన్ని అస్సలు సహించమని.. పోరాడి గెలుస్తామని కాంగ్రెస్ ట్వీట్ చేసింది.
అస్సాం పోలీసుల విజ్ఞప్తి మేరకు పవన్ ఖేరాను అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీని అవమానించారనే ఆరోపణలపై ఖేరాను అరెస్ట్ చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇటీవల విలేకరులు సమావేశంలో అదానీ హిండెన్ బర్గ్ వ్యవహారంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) విచారణ జరపాలని పవన్ ఖేరా డిమాండ్ చేశారు. పీవీ నరసింహరావు, అటల్ బిహారీ వాజ్ పేయిలు జేపీసీని ఏర్పాటు చేయగలిగితే.. ప్రధాని ‘‘నరేంద్ర గౌతమ్ దాస్’’.. సారీ నరేంద్ర దామోదర్ దాస్ మోదీకి ఏ సమస్య వచ్చిందని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పాజిటివ్ ఎనర్జీ, సిరిసంపదలు రావాలంటే ఈ టిప్స్ పాటించండి
-
UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
-
Nora Fatehi : జైలర్2లో స్పెషల్ సాంగ్.. అందాల విందు చేసి ఆరబోసిన నోరాఫతేహీ
-
Srikanth Odela: శ్రీకాంత్ ఓదెలపై నమ్మకం ఉంటుందా?.. నెక్ట్స్ హీరో ఎవరు?
-
Huawei Mate 90 Pro Max: హువావే Mate 90 Pro Max లాంచ్.. 200MP RYYB కెమెరా, 6,800mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్ప్లే
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్‌ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్‌ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!