Delhi Girl Murder: ఢిల్లీలో ఇటీవల 11 ఏళ్ల బాలిక ఆచూకీ కనిపించకుండా పోయింది. కొన్ని రోజుల తర్వాత హత్యకు గురై శవంగా దొరికింది. అయితే ఈ కేసును ఓ మిస్డ్ కాల్ ఆధారంగా పోలీసులు ఛేదించారు. ఢిల్లీలోని నాంగ్లోయ్ ప్రాంతంలో బాలిక కనిపించకుండా పోయిన రోజున ఆమె తల్లికి తెలియని నెంబర్ నుంచి మిస్డ్ కాల్ వచ్చింది.
Chhattisgarh Baloda Bazar road accident: రహదారులు నెత్తురోడుతున్నాయి. ప్రతీ రోజు ఎక్కడో చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అతివేగం, అజాగ్రత్త కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బలోడా బజార్-భటపరా జిల్లాలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
AAP councillor Pawan Sehrawat joins BJP: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిని దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆప్ కు చెందిన కౌన్సిలర్ పవన్ సెహ్రావత్ బీజేపీలో చేరారు. శుక్రవారం ఆయన బీజేపీ గూటికి చేరారు. సెహ్రావత్ బవానా వార్డు కౌన్సిలర్ గా ఉన్నారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు నిమిషాల ముందు ఈ ప్రకటన వెలువడింది. బీజేపీలోకి చేరిన తర్వాత ఆప్ పై విమర్శలు గుప్పించారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) సభలో గందరగోళం సృష్టించేందుకు తనపై…
Bengaluru: బెంగళూర్ నగరంలో వీసా గడువు ముగిసినప్పటికీ 600 మందికి పైగా విదేశీయులు తిష్ట వేసినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు నిర్ధారణకు వచ్చాయి. ఈ నేపథ్యంలో వీరందరినీ వారి దేశాలకు వాపసు పంపేందుకు హోంశాఖ కసరత్తు చేస్తోంది. పాకిస్థాన్‌కు చెందిన యువతిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువకుడు వివాహమాడి బెంగళూరులో కాపురం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చాక నగర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. పాక్ యువతిని స్వదేశానికి తిప్పి పంపిన తరహాలోనే నగరంలో తిష్టవేసిన ఆఫ్రికా దేశాలకు చెందిన వారిని కూడా వాపసు పంపే ప్రయత్నాలు చేపట్టినట్టు…
Congress Plenary Meetings: ఛత్తీస్ గడ్ రాజధాని రాయపూర్ వేదికగా నేటి నుంచి కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ ప్లీనరీ జరగనుంది. ఈ రోజు (శుక్రవారం) ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ పార్టీ స్టీరింగ్ కమిటీ సమావేశం జరగనుంది.
Wipro: ఐటీ సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. ఆర్ధికమాంద్యం భయాలతో ఇప్పటికే మెటా, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ వంటి దిగ్గజ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఇదిలా ఉంటే ఈ ప్రభావం భారత ఐటీ కంపెనీలపై కూడా పడుతోంది. దేశీయ దిగ్గజ ఐటీ సంస్థ విప్రో ఇటీవల ఫ్రెషర్ల జీతాలను తగ్గించాలని నిర్ణయించింది. రూ. 6.5 లక్షల ప్యాకేజీ ఉన్న ఉ
S Jaishankar on Pakistan economic crisis: పీకల్లోతు ఆర్ధిక కష్టాల్లో ఉంది దాయాది దేశం పాకిస్తాన్. తమ దేశం ఇప్పటికే దివాళా తీసిందని సాక్షాత్తు అక్కడి మంత్రులే చెబుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు. క్లిష్ట సమయంలో ఐఎంఎఫ్ కానీ, పాక్ మిత్రదేశాలు అయిన సౌదీ, యూఏఈ, చైనా వంటివి కూడా పాకిస్తాన్ కు సాయాన్ని అందించేందుకు ఇష్టపడటం లేదు. మరోవైపు రాజకీయ అస్థిరత కూడా పాకిస్తాన్ పరిస్థితి దిగజారడానికి కారణం అయింది. ఐఎంఎఫ్ తన షరతులకు అంగీకరిస్తేనే తప్పా పాకిస్తాన్…
Russia-Ukraine War: సరిగ్గా ఏడాది క్రితం ఫిబ్రవరి 24, 2022లో ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం ప్రారంభం అయింది. ఇప్పటికీ ఇరు దేశాల మధ్య రావణకాష్టంలా ఈ యుద్దం జరుగుతూనే ఉంది. ఈ యుద్ధంలో ఉక్రెయిన్, రష్యాలు తీవ్రంగా నష్టపోతున్నా, ఇరు దేశాలు పట్టు వీడటం లేదు. గతేడాది ఇదే రోజు తెల్లవారుజామున పెద్ద ఎత్తున రష్యా బలగాలు ఉక్రెయిన్ పై సైనికచర్యను ప్రారంభించాయి. ఈ యుద్ధం ఇరు దేశాలపైన మాత్రమే ప్రభావం చూపించలేదు. ప్రపంచంలో ప్రతీ దేశంపై దీని ఎఫెక్ట్ పడింది.
RUSSIA-UKRAINE WAR: ఉక్రెయిన్ పై రష్యా దాడి చేసి ఏడాది గడుస్తున్న సందర్భంగా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలని, తక్షణమే తమ బలగాలను ఉపసంహరించుకోవాలని రష్యాను డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో తీర్మానం చేశారు. అయితే ఈ తీర్మానానికి మెజారిటీ దేశాలు ఆమోదం తెలిపాయి.
Pakistan Economic Crisis- Viral Video: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ ప్రజలకు భారత్ విలువ తెలుస్తోంది. మాకు నరేంద్రమోదీ లాంటి ప్రధాని కావాలంటూ అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. ఇటీవల పాకిస్తాన్ జర్నలిస్ట్, యూట్యూబర్ సనా అమ్జాద్ ఓ యువకుడిని ‘‘ పాకిస్తాన్ నుంచి బతికి బట్టకట్టాలంటే మనం ఇండియాకు వెళ్లాలి’’ అని ఎందుకు నినాదాలు చేస్తున్నారని ప్రశ్నించిన సందర్భంలో ఆతను చెప్పిన సమాధానం ప్రస్తుతం రెండు దేశాల్లో వైరల్ గా మారింది.