Russia Announces Deal To Boost Oil Supplies To India: రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో యూరోపియన్ దేశాలు రష్యా నుంచి చమురు, సహజవాయువు కొనుగోలును నిలిపివేశాయి. అయితే రష్యా తన మిత్రదేశాలు అయిన ఇండియా, చైనాకు క్రూడ్ ఆయిల్ ను అత్యంత చౌకగా అందిస్తోంది. అమెరికాతో పాటు యూరోపియన్ దేశాలు భారత్ పై ఒత్తిడి చేస్తున్నా మోదీ ప్రభుత్వం దృఢంగా వ్యవహరిస్తోంది. మా ప్రజలు అవసరాలకు అనుగుణంగా ఎక్కడ తక్కువ ధరకు చమురు దొరికితే అక్కడ కొనుగోలు చేస్తామంటూ ఇప్పటికే పలుమార్లు భారత్…
Pakistan Crisis: పాకిస్తాన్ తో ఆహార సంక్షోభం తీవ్రమవుతోంది. గోధుమ పిండి దొరక్క ప్రజలు అల్లాడుతున్నారు. కొందాం అన్నా కూడా గోధుమ పిండి అందుబాటులో లేకుండా పోయింది. ఉన్నా కూడా కిలోకు వందల్లో ధరలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గోధుమ పిండితో లారీలు వెళ్తున్నాయంటే వాటిని వందలాది మంది పాకిస్తాన్ ప్రజలు వెంబడిస్తున్నారు. ట్రక్కుపై ఎక్కుతూ పిండిని దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి వీడియో తెగ వైరల్ అవుతోంది.
Massive 'Hole' Spotted on Sun's Surface: సౌరకుటుంబానికి మూలం సూర్యుడు. ఈ గ్రహాలను తన గురుత్వాకర్షణ శక్తితో తన చుట్టూ తిప్పించుకుంటున్నాడు. ఇదిలా ఉంటే సూర్యుడిపై భారీగా ఏర్పడిన నల్లటి ప్రాంతాన్ని నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది భూమి కన్నా 20 రెట్లు పెద్దగా ఉన్నట్లు వెల్లడించారు. ఇలాంటి భారీ బ్లాక్ స్పాట్లను ‘‘కరోనల్ హోల్’’గా పిలుస్తారు. భారీ సూర్యుడి వెలుగుల మధ్య నల్లటి ప్రాంతం ఓ రంధ్రంగా కనిపిస్తుంటుందని అందుకనే వీటిని కరోనాల్ హోల్ గా వ్యవహరిస్తుంటారు. సూర్యుని దక్షిణ ధ్రువానికి…
Amritpal Singh:పరారీలో ఉన్న ఖలిస్తాన్ వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ లొంగిపోయేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే ఢిల్లీ నుంచి పంజాబ్ కు అతడు వచ్చినట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది. అమృత్ సర్ స్వర్ణ దేవాలయం వద్ద అమృత్ పాల్ సింగ్ లొంగిపోయేందుకు వస్తున్నట్టు సమాచారం. మార్చి 18న భారీ ఆపరేషన్ నిర్వహించిన పంజాబ్ పోలీసులు అతడిని పట్టుకునేందుకు గత 12 రోజులగా ప్రయత్నిస్తున్నారు. అయితే హర్యానా మీదుగా ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది.
Rahul Gandhi: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. మే 10న ఎన్నికలు నిర్వహించనున్నట్లు, మే 13న ఫలితాలను ప్రకటించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు వెల్లడించింది. దీంతో రానున్న నెల రోజులు కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ విస్తృతంగా ప్రచారం చేయబోతున్నాయి. ఇదిలా ఉంటే కర్ణాటక ఎన్నికల్లో ప్రచారానికి కాంగ్రెస్ కీలక నేత, ఇటీవల అనర్హతను ఎదుర్కొన్న రాహుల్ గాంధీ సిద్ధం అవుతున్నారు. తాను ఎక్కడైతే వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, పరువునష్టం కేసులో శిక్ష పడి, పార్లమెంట్ సభ్యుడిగా అనర్హతకు గురయ్యాడో…
Google: టెక్ దిగ్గజం గూగుల్ కు షాక్ ఇచ్చింది నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్ఏటీ). 30 రోజుల్లో రూ. 1337 కోట్ల జరిమానాను కట్టాల్సిందే అని ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలను అతిక్రమించి, గుత్తాధిపత్యంగా వ్యవహరిస్తుందని గతంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) రూ. 1337 కోట్ల జరిమానాను విధించింది.
Karnataka: కర్ణాటక ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. మే 10న పోలింగ్ నిర్వహించి మే 13న ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. అయితే ప్రస్తుతం కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కొత్త తలనొప్పి వచ్చిపడింది. మంగళవారం మాండ్యాలో ప్రచారం చేస్తున్న కర్ణాటక కాంగ్రెస్ పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ నోట్లను వెదజల్లడం జాతీయ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చే ఒక రోజు ముందు ఈ ఘటన జరిగింది. దీనిపై ప్రతిపక్షాలు ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసింది.
Supermassive Black Hole: ఈ అనంత విశ్వంలో ఇప్పటి వరకు అంతుబట్టని విషయాల్లో బ్లాక్ హోల్ ఒకటి. మన శాస్త్రవేత్తలు విశ్వం గురించి తెలుసుకున్నది కేవలం కొంతమాత్రమే. ఇప్పటికే అంతుచిక్కని ఎన్నో రహస్యాలు ఈ బ్రహ్మాండం తనలో దాచుకుంది. బ్లాక్ హోల్స్ ఎప్పుడూ కూడా శాస్త్రవేత్తలకు సవాళ్లు విసురుతూనే ఉంటాయి. నక్షత్రాల కన్నా కొన్ని కోట్ల రెట్లు పెద్దదిగా ఉంటూ.. సమీపంలోని నక్షత్రాలను, గ్రహాలను తనలో కలిపేసుకుంటూ అంతకంతకు పెద్దదిగా మారుతుంది. చివరకు సెకన్ కు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే కాంతి…
Pakistan Economic Crisis: పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. విదేశీ మారక నిల్వలు లేక ఇతర దేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకునేందుకు తంటాలు పడుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ లో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్రమైన మందుల కొరతతో అల్లాడుతోంది. పాకిస్తాన్లోని డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ యొక్క వివాదాస్పద ధరల విధానం మరియు క్షీణిస్తున్న స్థానిక కరెన్సీ కారణంగా ఇతర దేశాల నుంచి ఔషధాలను దిగుమతి చేసుకునేందుకు ఇబ్బందులను ఎదుర్కొంటోంది. దీంతో ప్రాణాలు కాపాడే మందుల…
Jewellery Robbery: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో భారీ దోపిడి జరిగింది. ఏకంగా ఓ జువెలరీ షాప్ కు కన్నం వేశారు. మాస్టర్ ప్లాన్ వేసి జువెలరీని దోచుకున్నారు. వివరాల్లోకి వెళితే మీరట్ నగరంలోని ఓ నగల దుకాణంలోకి డ్రెయినేజీ నుంచి భారీ సొరంగాన్ని తవ్వారు. 10 అడుగుల సొరంగాన్ని నేరుగా జువెలరీలోకి తవ్వి లక్షల రూపాయల విలువై ఆభరణాలను దోపిడి చేశారు. మంగళవారం ఉదయం షాప్ తెలిసిన తర్వాత యజమాని సొరంగాన్ని చూసి షాక్ తిన్నాడు. షాపులోని ఆభరణాలు అన్నీంటిని దోచుకెళ్లినట్లు గమనించాడు.