Earthquake: జపాన్ భూకంపంతో వణికిపోయింది. మంగళవారం ఆ దేశంలో 6.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఉత్తర జపాన్ లోని అమోరిలో ఈ భూకంపం సంభవించినట్లు జపాన్ జాతీయ వాతావరణ సంస్థ వెల్లడించింది. భూకంపం సాయంత్ర 6.18 గంటలకు 20 కిలోమీటర్ల లోతులో సంభవించింది. భూకంపం వల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు సునామీ హెచ్చరికలను జపాన్ జారీ చేయలేదు.
Read Also: No-Confidence Motion: లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం..!
జపాన్ భూభాగం అత్యంత భారీ భూకంపాలు వచ్చే ప్రాంతంలో ఉంది. ఇక్కడ తరుచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. జపాన్ ‘‘పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్’’ ప్రాంతంలో ఉంది. ఇది ఆగ్నేయాసియా నుంచి పసిఫిక్ బేసిన్ అంతటా విస్తరించి ఉన్న తీవ్ర భూకంపాలు సంభవించే ప్రాంతం. ఈ ప్రాంతంలో సముద్ర గర్భంలో అగ్నిపర్వతాలు, టెక్టానిక్ ప్లేట్ కదలికలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి ప్రాంతంలో ఉన్నందు వల్లే జపాన్ లో అత్యంత కఠినమైన నిర్మాణాలు కలిగి ఉంది. 2011లో జపాన్ సమీపంలోని సముద్ర గర్భంలో 9.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీని ధాటికి సునామీ అలలు ఎగిసిపడి సెండాయ్ నగరాన్ని ధ్వంసం చేశాయి. 40.5 మీటర్ల ఎత్తులో ఎగిసిపడిన రాకాసి అలల కారణంగా 20 వేలకు పైగా ప్రజలు మరణించారు.