Rahul Gandhi: రాహుల్ గాంధీ జైలుశిక్ష, అనర్హత వేటు గురించి జర్మనీ స్పందించింది. ఈ అంశాన్ని గమనిస్తున్నామంటూ ఆ దేశ విదేశాంగ శాఖ కామెంట్స్ చేసింది. ఇదిలా ఉంటే ఈ విషయంలో జర్మనీ కలుగజేసుకోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ జర్మనీకి థాంక్స్ చెప్పడం ఇప్పుడు వివాదాస్పదం అయింది.
26/11 Mumbai Attack: 26/11 ముంబయి దాడికి ప్లాన్ చేసినవారు భారీ మూల్యాన్ని చెల్లించాల్సిందే అని ఇజ్రాయిల్ పార్లమెంట్ స్పీకర్ అన్నారు. తొలిసారిగా భారత్ పర్యటకు వచ్చిన అమీర్ ఓహానా నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్ కు వచ్చారు. ముంబై దాడికి ప్లాన్ చేసిన లష్కరేతోయిబా ఉగ్రవాది ఎవరైనా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని అన్నారు. భారత్, ఇజ్రాయిల్ రెండు ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నాయని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అన్ని దేశాలు ముందుకు రావాలని ఆయన అన్నారు.
World Idli Day: భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం. ప్రాంతాల వారీగా ప్రజలు ఆచారాలు, ఆహారపు అలవాట్లు, భాష, కట్టుబొట్టు మారుతుంటాయి. ముఖ్యంగా ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలో వంటల్లో భిన్నత్వం కనిపిస్తుంటుంది. దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువగా బియ్యం ప్రధానంగా ఉంటే ఇడ్లీలు, దోశెలు, ఊతప్ప ఇలాంటి టిఫిన్స్ కు ప్రాధాన్యత ఇస్తుంటారు. ముఖ్యంగా అల్పహారంలో ఇడ్లీలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతీ ఏడాది మార్చి 30ని ‘‘అంతర్జాతీయ ఇడ్లీ దినోత్సవం’’గా జరుపుకుంటారు.
Fastest Half-Centuries In IPL History: ఐపీఎల్ సంగ్రామానికి మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. రేపటి నుంచి క్రికెట్ లవర్స్ కి ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వినోదం పంచబోతోంది. రేపు గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ పోటీపడబోతున్నాయి. ఐపీఎల్ అంటేనే ఊర కొట్టడు.. 20 ఓవర్లలో ప్రేక్షకులకు కావాల్సిన వినోదం అందిస్తుంటుంది. రేపు ప్రారంభం అవబోతున్న ఐపీఎల్ లో మొత్తం 10 జట్లు పోటీపడుతాయి. రెండు నెలల పాటు వినోదాన్ని పంచబోతోంది. Read Also: Rahul […]
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరువునష్టం కేసులో రెండేళ్ల జైలుశిక్ష పడింది. దీంతో ఆయనపై ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 ప్రకారం అనర్హత వేటు పడింది. ఇదిలా ఉంటే అమెరికాతో పాటు పలు పాశ్చాత్య దేశాలు రాహుల్ గాంధీ అంశంపై స్పందిస్తున్నాయి. తాజాగా యూరోపియన్ దేశం జర్మనీ కూడా రాహుల్ గాంధీ అంశంపై స్పందించింది. రాహుల్ కేసును తాము గమనిస్తున్నామని జర్మనీ తెలిపింది. రాహుల్ గాంధీ కేసులో ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలు వర్తిస్తాయని, తీర్పుపై ఆయన అప్పీల్ చేసుకోవచ్చని పేర్కొంది.
30 people fell into a stepwell at an Indore temple: శ్రీరామ నవమి రోజుల విషాదం చోటు చేసుకుంది. ఇండోర్ లోని బేలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో జరిగిన ప్రమాదంలో నలుగురు భక్తులు మరణించారు. శ్రీరామ నవమి కావడంతో ప్రజలు ఎక్కువ సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చారు. దీంతో మెట్లబావిపై ఉన్న ఫ్లోర్ కూలిపోవడంతో ఒక్కసారిగా భక్తులు అందులో పడిపోయారు. మొత్తం 30 మంది బావిలో పడిపోయారు. ఇప్పటి వరకు నలుగురు మరణించగా.. 17 మందిని అధికారులు రక్షించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి…
North Korea: ఉత్తర కొరియా గురించి ప్రపంచానికి తెలిసింది తక్కువ. అ దేశంలో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియదు. కేవలం ఆ దేశం అణు ప్రయోగాలను మాత్రమే అక్కడి జాతీయ మీడియా ఛానెల్ చెబుతుంది. అయితే తాజాగా దక్షిణ కొరియా నివేదిక ప్రకారం ఉత్తర కొరియా ప్రభుత్వం తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘనటకు పాల్పడుతున్నట్లు తేలింది. ప్రజలు ‘జీవించే హక్కు’ అక్కడి ప్రభుత్వం కాలరాస్తోంది.
Namaz At Public Place: ఉత్తర్ ప్రదేశ్ లో లక్నో నగరంలో బహిరంగ ప్రదేశంలో నమాజ్ చేసినందుకు ఎంఐఎం నాయకురాలిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఎంఐఎం పార్టీకి చెందిన ఉజ్మా పర్వీన్ పై లక్నో పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఈ రోజు వెల్లడించారు. అతను ట్విట్టర్ ద్వారా ప్రార్థనలు చేస్తున్న ఫోటోలను పంచుకోవడంతో ఈ విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది. ప్రార్థనలు చేసే స్థలాన్ని విధాన్ భవన్ గా ఉజ్మా తప్పుగా చూపించారని, ఇది తప్పుదారి పట్టించేలా ఉందని సెంట్రల్ జోన్…
Karnataka Elections: కేంద్ర ఎన్నికల సంఘం కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో రాజకీయ పోరాటం ప్రారంభం అయింది. అధికారంలోకి రావడానికి కాంగ్రెస్, మరోసారి అధికారం నిలుపుకునేందుకు బీజేపీ, కింగ్ మేకర్ పాత్ర పోషించేందుకు జేడీఎస్ ప్రజలను ఆకట్టుకోవాలని చూస్తున్నాయి. ఇదిలా ఉంటే కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధ రామయ్య తనకు ఇవే చివరి ఎన్నికలంటూ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేశారు.
Dahi Controversy: తమిళనాడులో భాషాభిమానం ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పనక్కర లేదు. హిందీ పదం కనిపిస్తే చాలు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇప్పటికే అక్కడి స్టాలిన్ ప్రభుత్వం హిందీని తమపై రుద్దవద్దని చెబుతోంది. తాజాగా మరోసారి హిందీ కేంద్రంగా మరో వివాదం తమిళనాడులో చోటుచేసుకుంది. పెరుగు ప్యాకెట్లపై ‘‘దహీ’’ ఉండొద్దని చెబుతోంది తమిళనాడు ప్రభుత్వం. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ.. పెరుగు ప్యాకెట్లపై దహీ అనే పదం ఉండటం హిందీని రద్దు ప్రయత్నం జరుగుతోందని అన్నారు.