ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. గత అర్ధరాత్రి బొలెరో వాహనం 200 మీటర్ల గుంతలో పడింది. దీంతో అక్కడికక్కడే ఏడుగురు మృతిచెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు విడిచారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై ఉగాది రోజున హైకోర్టు విచారించనుంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించనుంది.
కాంగ్రెస్ తొలి జాబితాలోనే రాహుల్‌గాంధీ పేరు ప్రకటించారు. కేరళలోని వాయనాడ్ నుంచి పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఇటీవల ఆయన నామినేషన్ కూడా వేసేశారు.
ఢిల్లీ ప్రభుత్వానికి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మధ్య పొలిటికల్ దుమారం చెలరేగుతోంది. ఇప్పటికే జైల్లో నుంచి కేజ్రీవాల్ పరిపాలించడం కుదరని వీకే సక్సేనా వ్యాఖ్యానించారు.
ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ తాజా రాజకీయ పరిస్థితులపై స్పందించారు. దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫీవర్ నడుస్తోంది.