Ghulam nabi azad: ఎన్నికల్లో ఆజాద్ పోటీపై వీడని ఉత్కంఠ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ వ్యవస్థాపకుడు గులాం నబీ ఆజాద్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై మరోసారి సందిగ్ధత నెలకొంది. మొదట్లో పోటీ చేయడం లేదని ప్రచారం జరిగినా.. అనంతర పరిణామాల నేపథ్యంలో పోటీ చేస్తారని ఆ పార్టీ నాయకులు చెప్పుకొచ్చారు. తాజాగా మరోసారి పోటీపై సందిగ్ధత నెలకొంది. ఇటీవలే ఆ పార్టీ క్రేడర్.. ఆజాద్‌ను ఎన్నికల్లో పోటీ చేయాలని కోరాయి. దీనికి ఆయన కూడా సుముఖత వ్యక్తం చేశారు. అయితే మళ్లీ ఏమైందో.. ఏమో తెలియదు గానీ.. ఆయన పోటీపై వెనుకడుగు వేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: సీనియర్ ఐపీఎస్ అధికారి హఠాన్మరణంపై సీఎం దిగ్భ్రాంతి
Also Read
- Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
- CM Chandrababu Prakasam District Visit: నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
- Astrology: అక్టోబర్ 09 శుక్రవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లిస్తే అంతా శుభమే..!
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
తొలుత అనంత్‌నాగ్ లోక్‌సభ స్థానం నుంచి ఆజాద్ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. 2022లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఆజాద్ కొత్త పార్టీ స్థాపించారు. దీంతో ఆజాద్ పోటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పార్టీ స్థాపించి.. ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి అవుతుంది. దీంతో అనంత్‌నాగ్ సీటుపై జమ్మూకాశ్మీర్‌లో ప్రాముఖ్యత సంతరించుకుంది.
ఇది కూడా చదవండి: Memantha Siddham Bus Yatra: మళ్లీ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు బ్రేక్
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా అనేది ఇంకా నిర్ణయించుకోలేదని ఓ మీడియా ఛానల్‌కు ఆజాద్ తెలిపారు. తాను పోటీ చేయాలని పార్టీ నేతలు నిర్ణయం తీసుకున్నారని.. కానీ తాను మాత్రం తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పుకొచ్చారు. ఇక అనంత్‌నాగ్ నుంచి పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ తరపున మెహబూబా ముఫ్తీ పోటీ చేస్తున్నారు. ఇక ఆజాద్ కూడా ఇక్కడ నుంచి పోటీ చేస్తే గట్టి పోటీ నెలకొననుంది.
ఇది కూడా చదవండి: Uttarakhand: ఘోరం.. లోయలో పడ్డ బొలెరో వాహనం.. 8 మంది మృతి
ఆర్టికల్ 370 ప్రకారం ప్రత్యేక హోదాను ఆగస్టు 2019లో రద్దు చేసినప్పటి నుంచి కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకాశ్మీర్‌లో ఆరేళ్ల నుంచి అసెంబ్లీ ఎన్నికలు జరగలేదు. గత సంవత్సరం ఈ అంశంపై పిటిషన్‌లను విచారించిన సుప్రీంకోర్టు అసెంబ్లీ ఎన్నికలను తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించింది. సెప్టెంబర్ 30లోగా నిర్వహించాలని తెలిపింది.
ఇది కూడా చదవండి: RCB Fan: ఫ్యామిలీ ఎమర్జెన్సీ అని చెప్పింది.. ఐపీఎల్ మ్యాచ్‌కు వెళ్లి బాస్‌కు దొరికిపోయింది!
మెహబూబా ముఫ్తీ 2004, 2014లో అనంత్‌నాగ్ నుంచి ఎంపీగా గెలుపొందారు. 2019లో నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన జస్టిస్ (రిటైర్డ్) హస్నైన్ మసూది దాదాపు 10 వేల ఓట్లతో ఈ స్థానాన్ని గెలుచుకున్నారు. కాంగ్రెస్‌కు చెందిన గులామ్ అహ్మద్ మీర్ రన్నరప్‌గా.. మెహబూబా ముఫ్తీ మూడో స్థానంలో నిలిచారు. అనంత్‌నాగ్-రాజౌరీ స్థానానికి మే 7న మూడో దశలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభం అవుతుంది. సెకండ్ విడత ఏప్రిల్ 26, మే 7, 13, 20, 25, జూన్ 1న జరగనున్నాయి. ఇక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదలకానున్నాయి.
ఇది కూడా చదవండి: Israel: ఇజ్రాయెల్ కొత్త ప్రతిజ్ఞ.. కలకలం రేపుతున్న నెతన్యాహు వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Red Magic 12 Pro+: 8,400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+.. RGB లిక్విడ్ కూలింగ్‌తో కొత్త గేమింగ్ ఫోన్!
-
IND vs WI 2nd T20: నేడు భారత్, వెస్టిండీస్ రెండో టీ20.. పిచ్ రిపోర్ట్, వాతావరణం, ప్లేయింగ్ 11 ఇదే!
-
Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
-
NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
-
CM Chandrababu Prakasam District Visit: నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!