Kejriwal: ఉగాది రోజున బెయిల్ పిటిషన్ విచారణ.. సర్వత్రా ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై ఉగాది రోజున హైకోర్టు విచారించనుంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించనుంది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ మధ్యాహ్నం 2.30 గంటలకు కేసును విచారించనున్నారు. ఏప్రిల్ 3న ఈడీ.. కేజ్రీవాల్ తరఫు న్యాయవాదుల వాదనలు విన్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఈ కేసులో తన నిర్ణయాన్ని రిజర్వ్ చేశారు.
ఇది కూడా చదవండి: Fake Whatsapp: ఎస్పీడీసీఎల్ సీఎండీ ముష్రాఫ్ అలీ పేరుతో నకిలీ వాట్సాప్
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
కేజ్రీవాల్ బెయిల్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేజ్రీవాల్‌కు బెయిల్ వస్తుందని ఆప్ నేతలు భావిస్తున్నారు. ఇదే కేసులో ఇటీవల ఆప్ నేత సంజయ్‌సింగ్‌కు బెయిల్ లభించింది. ఆరు నెలల్లోనే ఆయనకు బెయిల్ వచ్చింది. ఇప్పుడు కేజ్రీవాల్‌కు కూడా బెయిల్ వస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆశిస్తున్నారు. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇది కూడా చదవండి: Astrology: ఏప్రిల్ 9, మంగళవారం దినఫలాలు
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మార్చి 21న ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను ఈడీ కస్టడీకి ఇచ్చింది. ఇక ఏప్రిల్ 1న రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయన్ను తీహార్ జైలుకు తరలించారు. ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారు. జైలు నుంచే పరిపాలనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒకవేళ రాజీనామా చేయాల్సి వస్తే.. ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పీఠంలో కూర్చుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకోవైపు దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీని ముందుండి నడిపించే నాయకుడి లేడు. దీంతో కేజ్రీవాల్‌కు బెయిల్ రావాలని ఆప్ నేతలు కోరుకుంటున్నారు. మరీ హైకోర్టు ఏం తీర్పు ఇవ్వనుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: అమేథీలో పోటీపై క్లారిటీ వచ్చేది అప్పుడే..!
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!