Messi -CM Revanth : హైదరాబాద్‌లో ఫుట్‌బాల్ అభిమానులకు మరుపురాని దృశ్యం ఆవిష్కృతమైంది. అంతర్జాతీయ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ తొలిసారి నగరానికి రాగా, ఆయన రాకతో ఉప్పల్ స్టేడియం సందడిగా మారింది. మెస్సీతో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్టేడియంకు చేరుకోవడంతో ఉప్పల్ ప్రాంతంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.
మెస్సీ గౌరవార్థం, క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహించే ఉద్దేశంతో ఉప్పల్ స్టేడియంలో ఒక ప్రత్యేకమైన ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్‌ను ఏర్పాటు చేశారు. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు తలపడుతున్నాయి అవే సింగరేణి ఆర్‌ఆర్ (RR) టీమ్, అపర్ణ మెస్సీ టీమ్. సింగరేణి ఆర్‌ఆర్ టీమ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా, అపర్ణ టీమ్‌లో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ భాగమయ్యారు.
ప్రస్తుతం జరుగుతున్న ఈ మ్యాచ్‌ను తిలకించడానికి అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయితే, మ్యాచ్‌లోని అత్యంత ఆసక్తికర ఘట్టం ఏమిటంటే ఇప్పటికే గ్రౌండ్ లోకి సీఎం రేవంత్ రెడ్డి రాగ, మెస్సీ మ్యాచ్ చివరి ఐదు నిమిషాల్లో గ్రౌండ్‌లోకి దిగి తన జట్టు తరపున ఆడనున్నారు. ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. రాజకీయ ప్రముఖులు, ప్రపంచ స్థాయి క్రీడాకారుడు ఒకే వేదికపై ఫుట్‌బాల్ ఆడటం నగర చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచిపోనుంది.
Finance Fraud : ఫైనాన్స్ పేరుతో మోసం..! స్పందన స్ఫూర్తి ఫైనాన్స్ పై ఆగ్రహం