పాకిస్థాన్ ప్రధానిగా రెండోసారి షెహబాజ్ షరీఫ్ బాధ్యతలు చేపట్టాక.. తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్లారు. సౌదీ అరేబియాలో పర్యటించారు. అక్కడ షెహబాజ్ షరీఫ్.. సౌదీ యువరాజ్ మహ్మద్ బిన్ సల్మాన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జమ్ముకశ్మీర్ అంశంపై చర్చించినట్లు సమాచారం. ఈ అంశంపై ఇరువురు నేతలు చర్చించినట్లు సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. అలాగే ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించడంతో పాటు, చారిత్రక సంబంధాలు, ద్వైపాక్షిక సహకారం మరియు వివిధ రంగాలలో మరింత అభివృద్ధికి అవకాశాలను సమీక్షించినట్లు తెలుస్తోంది.
ఇరు దేశాల ప్రయోజనాలతో పాటు అంతర్జాతీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాలు, వివిధ రంగాల్లో అభివృద్ధిపై ఉన్న అవకాశాలను సమీక్షించారు. ఈ క్రమంలో జమ్ముకశ్మీర్ అంశంపై చర్చలు జరిపారు. ఈ విషయాన్ని ఇరుదేశాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. భారత్- పాకిస్థాన్ నడుమ అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కార మార్గాలపై చర్చించినట్లు తెలిపాయి. ముఖ్యంగా జమ్ముకశ్మీర్ వివాదాన్ని ప్రస్తావనకు వచ్చింది. శాంతి, స్థిరత్వం నెలకొనడానికి రెండు దేశాలు జరపాల్సిన చర్చల అవసరం ఉందని అభిప్రాయపడినట్లు సమాచారం.
ఉగ్రవాదులను వదలబోమంటూ భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరికలపై పాకిస్థాన్ స్పందించింది. దానిని ఖండిస్తున్నట్లు పేర్కొన్న పాక్.. భారత్‌తో ఉన్న వివాదాల పరిష్కారానికి చర్చలు అవసరమని తెలిపింది. కాగా ఈ సమావేశంలో సౌదీ ప్రధానితో చర్చించిన అంశాలను పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.
రెండు దేశాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలను, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ వివాదాన్ని పరిష్కరించడానికి పాకిస్తాన్ మరియు భారతదేశం మధ్య చర్చల ప్రాముఖ్యతను ఇరుపక్షాలు నొక్కిచెప్పాయి, ఈ ప్రాంతంలో శాంతి మరియు సుస్థిరతను నిర్ధారించడానికి షరీఫ్-సల్మాన్ మధ్య జరిగిన సమావేశంపై సంయుక్త ప్రకటన వెలువడింది.
ఇటీవల పాకిస్థాన్‌లో జరిగిన ఎన్నికల్లో నవాజ్ షరీఫ్‌కు చెందిన పార్టీ విజయం సాధించింది. భుట్టో పార్టీతో మద్దతు అధికారం చేపట్టింది. ఇక జర్దారీ పాక్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
HRH the Crown Prince met with the Prime Minister of Pakistan. They reviewed historical relations, bilateral cooperation, and opportunities for further development across various sectors, in addition to discussing regional and international developments. pic.twitter.com/chNAnXiTqS
— Foreign Ministry 🇸🇦 (@KSAmofaEN) April 7, 2024