సుప్రీం కోర్టులో అనిల్ అంబానీకి చుక్కెదురైంది. అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన అనుబంధ సంస్థ ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు, ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ రూ.8,000 కోట్లు చెల్లించాల్సిన అవసరం లేదంటూ తాజాగా న్యాయస్థానం తీర్పునిచ్చింది.
హర్యానాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు మృతిచెందారు. మరో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు.
సార్వత్రిక ఎన్నికల వేళ మరో వివాదం తెరపైకి వచ్చింది. దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక స్కూళ్లను ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ కేంద్రంపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది.
గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా హడలెత్తించిన ఎండలు ఇప్పుడు కొద్దిగా శాంతించాయి. వేడి గాలులు తగ్గుమొఖం పట్టాయి. రెండు, మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఆయా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గాయి.
సార్వత్రిక ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్‌పై వేటు పడింది.
సార్వత్రిక ఎన్నికల వేళ కర్ణాటకలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆస్తుల కేసులో డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్‌కు కర్ణాటక లోకయుక్త నోటీసులు జారీ చేసింది. ఆస్తుల కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు అందజేయాలని ఆదేశించింది
సార్వత్రిక ఎన్నికల వేళ చైనాతో సంబంధాలపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాతో స్థిరమైన, శాంతియుత సంబంధాలు భారత్‌కే కాదు.. ప్రపంచానికీ కీలకమని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.