కాంగ్రెస్ తొలి జాబితాలోనే రాహుల్‌గాంధీ పేరు ప్రకటించారు. కేరళలోని వాయనాడ్ నుంచి పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఇటీవల ఆయన నామినేషన్ కూడా వేసేశారు. అయితే తాజాగా అమేథీలో కూడా పోటీ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు యూపీలోని అమేథీ, రాయ్‌బరేలీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించలేదు. 2019లో అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ ఓడిపోయారు. ఇక సోనియా గాంధీ ఈసారి ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. దీంతో రాయ్‌బరేలీ నుంచి ఎవరు పోటీ చేస్తారన్నదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటి వరకూ కాంగ్రెస్ అనేక సమావేశాలు నిర్వహించింది కానీ.. ఈ రెండు సీట్లపై క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇటీవల సోనియా అల్లుడు, ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా అమేథీ నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు దీనిపై కూడా క్లారిటీ రాలేదు. కానీ ఈ స్థానం నుంచి తిరిగి రాహులే పోటీ చేస్తారని వార్తలు షికార్లు చేస్తున్నాయి. అయితే వయనాడ్ పోలింగ్ ముగిశాక.. దీనిపై రాహుల్ ఒక నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
గత లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్‌తో పాటు అమేథీ నుంచి కూడా రాహుల్ పోటీ చేశారు. అయితే వయనాడ్‌లో విజయం సాధించిన రాహుల్ గాంధీ అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై ఓడిపోయారు. ఈసారి రాహుల్ అమేథీ నుంచి పోటీ చేస్తారా అనే విషయంలో పార్టీ క్యాడర్‌తో పాటు అభిమానుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర భారత దేశంలోనూ పార్టీకి ఊపు తీసుకురావాలంటే రాహుల్ అమేథీ నుంచి పోటీ చేయాలని పార్టీ శ్రేణులు గట్టిగా కోరుతున్నట్లు సమాచారం. అమేథీ నామినేషన్ల సమయానికి దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఇక దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభం అవుతోంది. సెకండ్ విడత ఏప్రిల్ 26, మే 7, 13, 20, 25, జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఇక ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. మరికొన్ని స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. ఇక విజయంపై ఆయా పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.