US: రష్యాకు అమెరికా మళ్లీ హెచ్చరికలు.. పట్టించుకుంటుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యాను మరోసారి అమెరికా హెచ్చరించింది. జపోరిజియా అణువిద్యుత్కేంద్రంపై డ్రోన్లతో ఆదివారం ఉక్రెయిన్ దాడి చేసింది. ఈ మేరకు ప్లాంట్ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో రష్యా వెంటనే అక్కడి నుంచి వైదొలగాలని అమెరికా కోరింది. తక్షణమే దాని నిర్వహణ బాధ్యతను ఉక్రెయిన్‌కు అప్పగించాలని సూచించింది. ఈ కేంద్రంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసిన నేపథ్యంలో అగ్రరాజ్యం స్పందించింది. అక్కడి పరిస్థితులను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడినా పెద్ద ప్రమాదం సంభవించొచ్చని రష్యాను హెచ్చరించింది.
ఇది కూడా చదవండి: RCB Fan: ఫ్యామిలీ ఎమర్జెన్సీ అని చెప్పింది.. ఐపీఎల్ మ్యాచ్‌కు వెళ్లి బాస్‌కు దొరికిపోయింది!
Also Read
జపోరిజియా అణువిద్యుత్కేంద్రంపై డ్రోన్ దాడి సమాచారం తమ దగ్గర ఉందని అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు. అక్కడి పరిస్థితులను తాము పర్యవేక్షిస్తున్నామని.. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ నుంచి కూడా నివేదికలు అందాయని చెప్పారు. ఎలాంటి ప్రమాదం జరగలేదని.. అణు కేంద్ర భద్రతకు ముప్పు లేదని తెలిసి ఊరట చెందినట్లు చెప్పుకొచ్చారు. ఐరోపాలోనే అతిపెద్ద అణువిద్యుత్కేంద్రాన్ని ఆక్రమించి రష్యా చాలా ప్రమాదకరమైన ఆట ఆడుతోందని ధ్వజమెత్తారు. అణు ప్రమాదం జరిగే ఎలాంటి చర్యలకూ రష్యా పాల్పడొద్దని అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Memantha Siddham Bus Yatra: మళ్లీ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు బ్రేక్
జపోరిజియా కేంద్రంపై డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి చేసిందని ప్లాంట్ అధికారులు ఆదివారం తెలిపారు. ఆరో పవర్ యూనిట్ డోమ్‌ను డ్రోన్లు తాకాయని, తీవ్ర నష్టమేమీ జరగలేదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై సైనికచర్య చేపట్టిన ఆరంభంలోనే జపోరిజియా కేంద్రాన్ని రష్యా దళాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. అప్పటి నుంచి ఈ కేంద్రం పరిసరాల్లో దాడులు, ప్రతిదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఐరోపాలోని అతి పెద్ద అణువిద్యుత్కేంద్రమైన జపోరిజియా రక్షణపై అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ కూడా పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది.
ఇది కూడా చదవండి: Lok Sabha Polls: తొలిదశలో 1625 మంది అభ్యర్థులు.. అందులో 252 మంది నేరచరితులే..
తాజావార్తలు
-
Nigeria Qualified: నైజీరియా సంచలనం.. ఐసీసీ ప్రపంచకప్‌కు క్వాలిఫై..
-
Balakrishna vs Nagarjuna: 22 ఏళ్ల క్రితం నాగ్ గెలిచాడు.. ఇప్పుడు బాలయ్య లెక్క సరిచేస్తాడా! క్రిస్మస్ విన్నర్ ఎవరు?
-
Ketan Agarwal Murder: పూణే కేతన్ అగర్వాల్ హత్యలో కీలక పరిణామం.. ఏం జరిగిందంటే.?
-
Israeli-Lebanon: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. 12 మంది మృతి
-
Free Coaching: ఫీజు సున్నా.. ఉద్యోగం పక్కా! నిరుద్యోగులకు APCRDA శుభవార్త..
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!