ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ తాజా రాజకీయ పరిస్థితులపై స్పందించారు. దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. అయితే ఇరుపక్షాల పార్టీలు రాజకీయ విమర్శలు చేసుకుంటున్నారు. మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి. ఇంకొందరు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. మరికొందరు మహిళలు టార్గెట్‌గా కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ హీరోయిన్లు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కంగనా రనౌత్, అలాగే హేమా మాలినిపై కాంగ్రెస్‌కు చెందిన నేతలు నోరుపారేసుకున్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారమే చెలరేగింది. తాజాగా ఈ వ్యాఖ్యలపై సద్గురు జగ్గీ వాసుదేవ్ స్పందిస్తూ రాజకీయాల్లో మహిళల పట్ల ఉపయోగించే భాష మారాలన్నారు. ఈ మేరకు పార్టీ నేతలు మార్పు రావాలని సద్గురు పిలుపునిచ్చారు.
66 ఏళ్ల జగ్గీ వాసుదేవ్ ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన తలనొప్పితో బాధపడ్డారు. దీంతో ఆయన్ను ఢిల్లీలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆయనకు స్కాన్లు చేయగా.. బ్రెయిన్‌లో ప్రమాదకర స్థితిని గుర్తించారు. అనంతరం కొన్న గంటల్లోనే ఆయనకు వైద్యులు బ్రెయిన్ సర్జరీ చేశారు. అపరేషన్ విజయవంతంగా సక్సెస్ అయింది. ఈ విషయం తెలియగానే కేంద్రం పెద్దలు, అభిమానులు త్వరగా కోలుకోవాలని కోరారు. ప్రధాని మోడీ స్వయంగా సద్గురుకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. శస్త్ర చికిత్స తర్వాత సద్గురు త్వరగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నారు.
తాజాగా ఎన్నికల్లో మహిళలపై జరుగున్న విమర్శలను ఆయన తప్పుపట్టారు. మహిళల పట్ల రాజకీయకంగా భాష మారాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన రాజకీయ పార్టీలకు సందేశం ఇచ్చారు.