బీజేపీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారైంది. సార్వత్రిక ఎన్నికల వేళ మేనిఫెస్టో తయారీకి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆధ్వర్యంలో బీజేపీ అధిష్టానం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ దేశ వ్యాప్తంగా ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. తన అరెస్ట్‌పై అత్యవసరంగా విచారించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అందుకు న్యాయస్థానం అంగీకరించలేదు.
కాంగ్రెస్ అగ్ర రాహుల్‌గాంధీ తమిళనాడులో సందడి చేశారు. చెన్నైలో రోడ్డు పక్కన ఉన్న ఓ స్వీట్ షాపులోకి వెళ్లి స్వీట్లు కొనుగోలు చేశారు. అనంతరం ఆ స్వీట్ బాక్సును నేరుగా ముఖ్యమంత్రి స్టాలిన్‌కు అందజేశారు. దాన్ని అందుకున్న స్టాలిన్.. వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమి విక్టరీ సాధించబోతుందని.. జూన్ 4న ఇలాంటి తీపి కబురే దక్కుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: Nagababu: అన్నీ సర్దుకున్నాయి.. భారీ మెజార్టీతో గెలవబోతున్నాం.. రాహుల్ గాంధీ […]
తన పెంపుడు కుక్క మరణానికి కారణమైన నిందితుడిపై తర్వగా చర్యలు తీసుకునేలా విచారణ చేపట్టాలని బాలీవుడ్ నటి అయేషా జుల్కా బొంబే హైకోర్టును ఆశ్రయించారు. నాలుగేళ్ల క్రితం ఆమె పెంపుడు కుక్కను కేర్‌టేకర్ చంపేశాడు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. మూడు రోజుల పాటు ఆమెను విచారించనున్నారు. ఇప్పటికే తీహార్ జైల్లో పలు ప్రశ్నలు సంధించారు.
24 గంటల్లో ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేయబోతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా.. తనమిత్ర దేశమైన ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచింది. ఇప్పటికే సహాయసహకారాలు అందిస్తున్న అమెరికా.. తాజాగా యుద్ధనౌకలను దింపింది.
సౌదీ జైల్లో ఉన్న కేరళ వ్యక్తి కోసం కేరళీయులు పెద్ద మనసు చాటుకున్నారు. అతన్ని విడిపించుకునేందుకు ఏకంగా రూ.34 కోట్లు సమకూర్చారు. కేరళలోని కోజికోడ్‌కు చెందిన అబ్దుల్ రహీమ్ సౌదీలో బాలుడికి సంరక్షకుడిగా ఉండేవాడు.
ప్రముఖ ఇటాలియన్ ఫ్యాషన్ డిజైనర్ రాబర్టో కావల్లి (83) కన్నుమూశారు. ఇంట్లో ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1940, నవంబర్ 15న ఇటలీలోని ఫ్లోరెన్స్‌లో జన్మించారు. ఏప్రిల్ 12, 2024న ఆయన నివాసంలోనే ప్రాణాలు విడిచారు.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణ అలుముకుంది. ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులకు తెగబడవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా.. ఇజ్రాయెల్‌ను అప్రతమత్తం చేసింది. ఇటీవల సిరియా రాజధాని డమస్క్లో ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు తెగబడింది.
ఢిల్లీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఓ కారు ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఓ వివాహ కార్యక్రమానికి హాజరై.. అర్ధరాత్రి బైక్‌పై సోదరీమణులతో కలిసి సురేందర్ ఇంటికి తిరిగి వెళ్తుండగా వేగంగా వచ్చిన కారు.. బైక్‌ను ఢీకొట్టి వారి మీద నుంచి వెళ్లిపోయింది.