Kishan Reddy: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగిన సమావేశం విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. సమావేశంలో జరిగిన విషయాలను బయటకు లీక్ చేయడం పూర్తిగా తప్పని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో లీక్ వీరులు ఎవరో తెలిసిన వెంటనే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రధానమంత్రితో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలను బయటకు చెప్పొద్దని పీఎం స్వయంగా స్పష్టంగా సూచించారని కిషన్ రెడ్డి తెలిపారు. అయినప్పటికీ, లోపల జరిగినది ఒకటి కాగా బయట ప్రచారం చేస్తున్నది మరోలా ఉందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశానికి సంబంధించిన విషయాలను వక్రీకరించి ప్రచారం చేయడం అనుచితమని అన్నారు.
Vikarabad: అర్థరాత్రి దారుణం… ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థిపై కత్తితో దాడి
ఆ సమావేశంలో తెలంగాణలో పార్టీ బలోపేతానికి సంబంధించి ప్రధానమంత్రి కీలక సలహాలు ఇచ్చారని కిషన్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యంగా పార్టీ కార్యకలాపాలను మరింత చురుకుగా నిర్వహించాలన్న దానిపై దృష్టి పెట్టాలని, సోషల్ మీడియాలో యాక్టివిటీ పెంచాలని ప్రధాని సూచించినట్లు తెలిపారు. మొత్తానికి, ప్రధానమంత్రి తో జరిగిన అంతర్గత సమావేశాల విషయాలను బయటకు లీక్ చేయడం కచ్చితంగా తప్పని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ఇలాంటి చర్యల వల్ల పార్టీకి, ప్రభుత్వానికి నష్టం వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరిస్తూ, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.
Bigg Boss 9: ట్రోఫీ తనుజదేనా..? గ్రాండ్ సపోర్ట్ పోస్ట్‌లతో హోరెత్తుతున్న సోషల్ మీడియా.. !