వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్ని ఇప్పటికే బీఆర్ఎస్ ప్రకటించింది. ఇక నాల్గో విడత జరిగే ఎన్నికలకు ఈనెల 19న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మరోసారి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి వ్యక్తిగత వైద్యుడ్ని నియమించాలని ఆయన న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.
బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ నివాసం దగ్గర కాల్పులు జరిపిన కేసులో కీలక పరిమాణం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇద్దరు నిందితుల్ని పోలీస్ కస్టడీకి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.
పాకిస్థాన్ అధ్యక్షుడు జర్దారీ కుమార్తె ఆసీఫా భుట్టో ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. నేషనల్ అసెంబ్లీ సభ్యురాలిగా ఆమె ప్రమాణం చేశారు. మార్చి 29న షహీద్ బెనజీరాబాద్ నుంచి ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కొమరంభీం జిల్లా కాగజ్‌నగర్ అటవీ ప్రాంతంలో పులి సంచారం కలకలం రేపుతోంది. పులి జాడలను అధికారులు గుర్తించారు. పులి సంచారం నేపథ్యంలో అంకుశాపూర్ వాంకిడి వైపు వెళ్లే దారిలో సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు రాకపోకల నిషేధం విధించారు.