Fashion designer: ఇటాలియన్ ఫ్యాషన్ డిజైనర్ రాబర్టో కావల్లి కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ ఇటాలియన్ ఫ్యాషన్ డిజైనర్ రాబర్టో కావల్లి (83) కన్నుమూశారు. ఇంట్లో ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1940, నవంబర్ 15న ఇటలీలోని ఫ్లోరెన్స్‌లో జన్మించారు. ఏప్రిల్ 12, 2024న ఆయన నివాసంలోనే ప్రాణాలు విడిచారు. రాబర్టో.. విలాసవంతమైన దుస్తులు డిజైన్ చేస్తుంటారు. విద్యార్థి దశ నుంచే ఫ్యాషన్‌పై మక్కువ ఉంది. 1970లో తోలుపై ప్రింటింగ్ ప్రక్రియను రూపొందించారు. జంతు-ముద్రణ డిజైన్లకు ఎంతో ప్రసిద్ధి చెందారు. ఇక దుస్తులపై హిందూ దేవతల చిత్రాలను రూపొందించడంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో కవల్లి క్షమాపణ చెప్పారు.
Also Read
- TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
- Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!

ఇక 1964లో సిల్వానెల్లా జియానోనిని కవల్లి వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టారు. అనంతరం 1974లో విడాకులు తీసుకున్నారు. అనంతరం 1980లో మాజీ మిస్ ఆస్ట్రియా.. 1977లో మిస్ యూనివర్స్ పోటీలో మొదటి రన్నరప్ అయిన ఎవా డ్యూరింగర్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. 2010లో వీరు విడాకులు తీసుకున్నారు. అనంతరం స్వీడిష్ మోడల్ సాండ్రా నిల్సన్‌ను వివాహం చేసుకున్నారు. ఈమెకు ఒకరు పుట్టారు. ఇలా మొత్తం కవల్లికి ఆరుగురు సంతానం. కవల్లి మృతికి పలువురు సంతాపం తెలిపారు. కావల్లి అంత్యక్రియలు సోమవారం ఫ్లోరెన్స్‌లో నిర్వహించనున్నట్లు ఇటలీ మీడియా వెల్లడించింది.


ఇది కూడా చదవండి: TTD For Ayodhya: ఇవాళ అయోధ్యకు టీటీడీ కమిటీ..
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!