Delhi: ఢిల్లీలో దారుణం.. కారు ఢీకొని ముగ్గురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఓ కారు ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఓ వివాహ కార్యక్రమానికి హాజరై.. అర్ధరాత్రి బైక్‌పై సోదరీమణులతో కలిసి సురేందర్ ఇంటికి తిరిగి వెళ్తుండగా వేగంగా వచ్చిన కారు.. బైక్‌ను ఢీకొట్టి వారి మీద నుంచి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఘటనాస్థలిలోనే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రేటర్ నోయిడాలోని పరి చౌక్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: TDP – BJP – Jana Sena Alliance: కూటమిలో తగ్గని అసమ్మతి సెగలు.. రెబల్స్‌గా బరిలోకి..!?
Also Read
- WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
- Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
- Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
ఢిల్లీ సమీపాన ఉన్న గ్రేటర్ నోయిడాలో అర్ధరాత్రి 2 గంటల సమయంలో అతివేగంగా వచ్చిన కారు.. బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సోదరుడు, అతని సోదరీమణులిద్దరూ ప్రాణాలు విడిచారు. మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరంతా ఓ పెళ్లికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. కారు అదుపు తప్పి వీరి బైక్‌ను ఢీకొట్టింది. సురేందర్, అతని సోదరీమణులు శైలి, అను మృతిచెందగా.. మరొకరు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నాడు. నోయిడాలోని కులేసరలో నివాసం ఉంటున్నారు. సుమారు 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న కస్నా ప్రాంతంలో వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దారుణం జరిగిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. బైక్‌ను ఢీకొట్టిన తర్వాత కారు వారి మీద వెళ్లినట్లు దృశ్యాలు ఉన్నట్లు పోలీసులు తెలుపుతున్నారు. బైక్‌ను ఢీకొట్టిన కారును ఇంకా గుర్తించలేదన్నారు. అలాగే ఎవర్నీ అరెస్ట్ చేయలేదని.. సీసీటీవీని పరిశీలించాక ముందుకు వెళ్తామని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Cricket Betting: ప్రాణాలు తీసిన క్రికెట్ బెట్టింగ్.. కాకినాడలో యువకుడి ఆత్మహత్య
తాజావార్తలు
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
-
Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
-
Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
-
ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!