Vikarabad: వికారాబాద్ జిల్లా దోమ మండలం రాకొండ గ్రామంలో అర్థరాత్రి చోటుచేసుకున్న హింసాత్మక ఘటన కలకలం రేపింది. గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అర్జున్‌పై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానికుల వివరాల ప్రకారం, అర్థరాత్రి ముసుగు వేసుకుని వచ్చిన వ్యక్తి అకస్మాత్తుగా అర్జున్‌పై దాడి చేసి పరారయ్యాడు. ఈ దాడిలో అర్జున్‌కు పొత్తికడుపు భాగంలో మూడు చోట్ల తీవ్ర గాయాలు అయ్యాయి. రక్తస్రావంతో కుప్పకూలిన అతడిని గమనించిన గ్రామ యువకులు వెంటనే పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Sydney Attack: ‘అహ్మద్ ఆస్ట్రేలియా హీరో’.. ఆస్పత్రిలో పరామర్శించిన ప్రధాని ఆంథోనీ
ఇక వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అర్జున్‌కు గాయాలు ఉన్నప్పటికీ ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. వైద్య చికిత్స కొనసాగుతోందని, ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని వెల్లడించారు. అర్జున్‌ను ప్రోత్సహిస్తూ గ్రామ యువకులు అతడిని సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో నిలిపినట్లు తెలుస్తోంది. గ్రామంలో అర్జున్‌కు పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకే కావాలనే ఈ దాడి జరిగిందని అర్జున్ తరఫు యువకులు ఆరోపిస్తున్నారు. రాజకీయ కారణాలే ఈ ఘటనకు మూలమని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Upasana : మెగా ఫ్యాన్స్‌కు .. ఉపాసన నుంచి డబుల్ గుడ్ న్యూస్
దాడి ఘటనతో రాకొండ గ్రామంలో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. బాధితుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడ్డ నిందితులను త్వరలోనే గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.