Iran-Israel: కమ్ముకున్న యుద్ధ మేఘాలు.. ఏ క్షణంలోనైనా దాడులు.. అన్ని దేశాలు అలర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణ అలుముకుంది. ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులకు తెగబడవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా.. ఇజ్రాయెల్‌ను అప్రతమత్తం చేసింది. ఇటీవల సిరియా రాజధాని డమస్క్‌లో ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు తెగబడింది. ఈ ఘటనలో పలువురు ఇరానీ ఆఫీసర్లు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు గాజాపై దాడిని కూడా ఇరాన్ జీర్ణించుకోలేకపోతుంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌పై దాడి చేయాలని ఇరాన్ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని ఇప్పటికే అమెరికాను ఇరాన్ హెచ్చరించింది. జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్‌పై దాడులు జరగొచ్చని సమాచారం. మరోవైపు ఇజ్రాయెల్ కూడా అప్రమత్తం అయింది. ఇరాన్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Gadchiroli : 130 డ్రోన్లు, 17 హెలికాప్టర్లు, 15 వేల మంది సైనికులు గడ్చిరోలిలో ఓటింగ్‌పై గట్టి నిఘా
Also Read
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
- Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
- T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
- Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఆయా దేశాలు తమ పౌరులను అలర్ట్ చేశాయి. ఇరాన్-ఇజ్రాయెల్ దేశాలకు వెళ్లొద్దని సూచించాయి. ఫ్రాన్స్, భారత్, రష్యా, పోలాండ్, అమెరికా సహా పలు దేశాలు.. ఇజ్రాయెల్ వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశాయి. తాము సమాచారం తెలియజేసే వరకూ వెళ్లొద్దని పేర్కొన్నాయి. ఇక తమ పౌరులు భారత రాయబార కార్యాలయాలను సంప్రదించాలని విదేశీ వ్యవహారాల శాఖ సూచించింది.
ఇది కూడా చదవండి: Cricket Betting: ప్రాణాలు తీసిన క్రికెట్ బెట్టింగ్.. కాకినాడలో యువకుడి ఆత్మహత్య
ఇక ఇజ్రాయెల్‌ను అమెరికా అప్రమత్తం చేస్తూనే.. తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఫోన్ చేసి భరోసా ఇచ్చారు. ఇరాన్ ఏ క్షణంలోనే దాడులకు పాల్పడొచ్చని.. అందుకు సిద్ధంగా ఉండాలని అలర్ట్ చేసింది. మరోవైపు జర్మన్ సహా పలు దేశాలు విమాన సర్వీసులను రద్దు చేశాయి. మరోవైపు గత ఆరు నెలలుగా గాజా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం సాగుతోంది. ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వేలాది ఇళ్లులు నేలమట్టం అయ్యాయి. ఇంకా యుద్ధం సాగుతూనే ఉంది. మరోవైపు దాడులకు విరామం ప్రకటించాలని ఇజ్రాయెల్‌తో చర్చలు కూడా నడుస్తున్నాయి. ఇంతలోనే మరో ముప్పు పొంచి ఉంది. తాజాగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకరమైన యుద్ధం సాగేటట్లు సూచనలు కనిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Rains: ఐదు రోజుల పాటు వర్షాలు.. ఎల్లో, ఆరేంజ్ అలర్ట్ జారీ
తాజావార్తలు
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
ట్రెండింగ్
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..