తన పెంపుడు కుక్క మరణానికి కారణమైన నిందితుడిపై తర్వగా చర్యలు తీసుకునేలా విచారణ చేపట్టాలని బాలీవుడ్ నటి అయేషా జుల్కా బొంబే హైకోర్టును ఆశ్రయించారు. నాలుగేళ్ల క్రితం ఆమె పెంపుడు కుక్కను కేర్‌టేకర్ చంపేశాడు. అప్పటి నుంచి కేసు నత్తనడకన సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
కుర్బాన్, జో జీతా వోహీ సికందర్ వంటి చిత్రాలతో ప్రసిద్ధి చెందిన బాలీవుడ్ నటి అయేషా జుల్కా తన పెంపుడు కుక్క రాకీ అనుమానాస్పద మృతిలో మృతిచెందింది. ఆరేళ్ల కుక్క 2020 సెప్టెంబర్ 13న ఆయేషాకు చెందిన లోనావాలా బంగ్లాలో అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. కేర్‌టేకర్ రామ్ ఆండ్రేను అనుమానిస్తూ ఆమె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దాదాపుగా నాలుగేళ్లు అవుతున్న కేసు మాత్రం ఒక కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో ఆమె హైకోర్టును ఆశ్రయించారు.
ఇది కూడా చదవండి: Summer Tips: వేసవిలో డీహైడ్రేషన్ కు నుంచి బయట పడాలంటే ఈ చిట్కాలను పాటించాలి..
సెప్టెంబరు 17, 2020న కేర్‌టేకర్ ఆండ్రేపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. తాను మత్తులో కుక్కను గొంతు కోసి చంపినట్లు పోలీసుల ముందు ఆండ్రే అంగీకరించాడు. సెప్టెంబర్ 25న అరెస్టు చేసి జైలుకు పంపించారు. కానీ రెండు రోజుల తర్వాత బెయిల్ మంజూరైంది. ఇక జనవరి 7, 2021న ఈ కేసులో మావల్ పోలీసులు ఛార్జిషీట్ కూడా దాఖలు చేశారు. అప్పటి నుంచి కేసు విచారణ పెండింగ్‌లోనే ఉంది. దర్యాప్తు సమయంలో రక్తంతో తడిసిన బెడ్‌షీట్‌ను పూణేలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఆ నివేదిక ఇంకా రాలేదు. నివేదికను సేకరించేందుకు సిబ్బంది లేరని జుల్కా న్యాయ బృందానికి మౌఖికంగా సమాచారం అందించారు.
ఇది కూడా చదవండి: Kavitha: కవితను కస్టడీలోకి తీసుకున్న సీబీఐ.. వాట్సప్ చాట్‌పై ప్రశ్నించే ఛాన్స్
2021లో పోలీసులు రామ్ ఆండ్రేపై ఛార్జిషీట్ దాఖలు చేసినప్పటికీ.. పూణేలోని మావల్‌లోని మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ సాగుతూ ఉంది. కుక్క నీటిలో మునిగిపోయిందని.. ఊపిరాడకపోవడంతోనే చనిపోయినట్లుగా పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. ఆండ్రేపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 429 (చంపడం, జంతువులను అణగదొక్కడం) కింద కేసు నమోదు చేశారు. కేసు విచారణపై విసుగు చెందిన ఆమె తన న్యాయవాది హర్షద్ గరుడ్ ద్వారా హైకోర్టులో పిటిషన్ వేయించారు. కేసును వేగవంతం చేయాలని కోరారు. ఇదిలా ఉంటే ఫోరెన్సిక్ రిపోర్టును మాత్రం ఇప్పటివరకూ పోలీసులు కోర్టుకు సమర్పించలేదు. శుక్రవారం విచారించిన కోర్టు.. సింగిల్ జడ్జి బెంచ్ వేగవంతంగా విచారించాలని జస్టిస్ రేవతి మోహితే దేరే, జస్టిస్ మంజుషా దేశ్‌పాండేలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.
ఇది కూడా చదవండి: Nagarjuna Sagar: డెడ్ స్టోరేజ్ కి నాగార్జునసాగర్ నీటిమట్టం.. సాగునీటి విడుదలకు నో ఛాన్స్..?!