Bengal-EC: బెంగాల్‌లో ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.. 58 లక్షల ఓట్లు తొలగింపు
- బెంగాల్‌లో ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
- 58 లక్షల ఓట్లు తొలగింపు
- పూర్తైన ప్రత్యేక ఓటర్ సర్వే
- తుది జాబితా ఫిబ్రవరిలో విడుదలయ్యే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముసాయిదా ఓటర్ జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. నవంబర్‌లో ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ ప్రారంభించింది. ప్రత్యేక సర్వే ముగియడంతో మంగళవారం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ప్రత్యేక సర్వే తర్వాత బెంగాల్‌లో 58 లక్షలకు పైగా పేర్లు తొలగించబడినట్లు తెలిపింది. ఈ 58 లక్షల మంది జాడ లేదని పేర్కొంది.
ఇది కూడా చదవండి: Gold Rates: గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. నేటి బంగారం ధరలు ఇలా..!
Also Read
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
ఓటర్లు నమోదిత చిరునామాలో లేరని.. శాశ్వతంగా బదిలీ అవ్వడమో.. లేదంటే మరణించి ఉంటారని.. దీంతో 58 లక్షల మంది పేర్లు తొలగించినట్లు పేర్కొంది. ప్రస్తుతం 7.66 కోట్లకు పైగా ఓటర్లు పరిగణనలో ఉన్నట్లు తెలిపింది. 7,66,37,529 మంది ఓటర్లు సవరణ డ్రైవ్ పరిధిలోకి వచ్చినట్లు ఈసీ వెల్లడించింది. అక్టోబర్ 27న ఎన్నికల సంఘం ఓటర్ సవరణ షెడ్యూల్ ప్రకటించింది. అనంతరం నవంబర్ 4న SIR కసరత్తు ప్రారంభమైంది. ఇక తుది ఓటర్ల జాబితా ఫిబ్రవరి 14న విడుదలయ్యే అవకాశం ఉంది. అభ్యంతరాలు, విచారణల ప్రక్రియ మాత్రం ఫిబ్రవరి, 2026 కొనసాగుతుందని ఈసీ పేర్కొంది.
ఇది కూడా చదవండి: Sydney Attack: ‘అహ్మద్ ఆస్ట్రేలియా హీరో’.. ఆస్పత్రిలో పరామర్శించిన ప్రధాని ఆంథోనీ
వచ్చే ఏడాది ప్రారంభంలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ప్రత్యేక సర్వే చేపట్టింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఇదే మాదిరిగా సర్వే చేపట్టింది.
తాజావార్తలు
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!