పసిడి ప్రియులకు శుభవార్త. మంగళవారం బంగారం ధరలు దిగొచ్చాయి. నిన్న పెరిగిన ధరలు.. ఈరోజు మాత్రం తగ్గాయి. తులం గోల్డ్‌పై రూ.1,520 తగ్గగా.. సిల్వర్‌పై మాత్రం ఏకంగా రూ.3,900 తగ్గింది. దీంతో మగువలు బంగారం కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఇది కూడా చదవండి: Punjab: మొహాలీలో దారుణం.. సిద్ధూ మూస్ వాలా మృతికి ప్రతీకారంగా కబడ్డీ ప్లేయర్ హత్య
బులియన్ మార్కెట్‌లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.1,520 తగ్గి రూ.1,33,860 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ. 1,400 తగ్గి రూ.1,22,700 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,150 తగ్గి రూ.1,00,390 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: UN-India: ఒకరిని జైల్లో పెట్టారు.. ఇంకొకరిని అందలం ఎక్కించారు.. పాక్‌పై భారత్ ధ్వజం
ఇక సిల్వర్ ధర కూడా ఉపశమనం కలిగించింది. ఈరోజు ఏకంగా కిలో వెండిపై రూ.3,900 తగ్గింది. దీంతో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.1,99,100 దగ్గర ట్రేడ్ అవుతోంది. అయితే హైదరాబాద్, చెన్నై బులియన్ మార్కెట్‌లో మాత్రం రూ.2,11,000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.1,99, 100 దగ్గర ట్రేడ్ అవుతోంది.