హమాస్ సృష్టించిన ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తు్న్నాయి. అక్టోబర్ 7న ఇజ్రాయెలీయులను బందీలుగా తీసుకెళ్లిన ఓ వీడియో ఒకటి బయటకు వచ్చింది. అందులో ఇజ్రాయెల్ మహిళా సైనికుల పట్ల క్రూరత్వం ప్రదర్శించినట్లుగా కనిపిస్తోంది.
పౌర అశాంతి, నియంతృత్వం వైపు పయనం, నిరంతర ఉగ్రవాద బెదిరింపులు, అమెరికన్ వ్యతిరేక భావాల కారణంగా వెనిజులా దేశం వెళ్లొద్దని తన పౌరులకు అమెరికా హెచ్చరించింది.
ప్రతి బూత్‌లో పోలింగ్ ముగిసిన 48 గంటలలోపు పోలైన ఓట్లు/లేదా తిరస్కరించబడిన ఓట్లతో సహా ఓటరు ఓటింగ్ డేటాను విడుదల చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను లోక్‌సభ ఎన్నికల ముగిసే వరకు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
ఒకప్పుడు విద్యలేని వాడు వింత పశువు అన్నారు. నేటి విద్యావంతులు.. పశువులు కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. మరీ వీళ్లను ఏమనాలో..! విద్య సంస్కారం, క్రమశిక్షణ నేర్పిస్తుంది.
దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభం కాగా.. ముగింపు కూడా స్వల్ప నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 7 పాయింట్లు నష్టపోయి.. 75,410 దగ్గర ముగియగా.. నిఫ్టీ 10 పాయింట్లు నష్టపోయి 22,957 దగ్గర ముగిసింది.
ఉత్తర భారత్‌ను తీవ్రమైన వడగాలులు హడలెత్తిస్తున్నాయి. గత కొద్ది రోజులు ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి. దీంతో బయటకురావాలంటేనే హడలెత్తిపోతున్నారు. ఉదయం నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. దీంతో వృద్ధులు, పిల్లలు బెంబేలెత్తిపోతున్నారు.
రష్యా తాజాగా ఉక్రెయిన్‌పై క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఏడుగురు ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. బఫర్‌జోన్ ఏర్పాటే లక్ష్యంగా ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ఉధృతం చేసింది
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఐదు విడతల పోలింగ్ ముగిసింది. ఇక ఆరో విడత శనివారం జరగనుంది. చివరిగా జూన్ 1న జరగనుంది. ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదలకానున్నాయి.
గత కొద్ది రోజులుగా పాలస్తీనా అనుకూల నిరసనలతో అగ్రరాజ్యం అమెరికాలోని యూనివర్సిటీలు అట్టుడుకుతున్నాయి. ఇప్పటికే పలు యూనివర్సిటీలో జరుగుతున్న ఆందోళనలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పలువురు విద్యార్థులను అరెస్ట్ చేయడం కూడా జరిగింది
థానే కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు కారణంగా పలువురి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ముంబైకి సమీపంలోని థానేలోని డోంబివాలిలో గురువారం భారీ పేలుడు సంభవించింది.