Palestine protests effect: ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి తాళం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొద్ది రోజులుగా పాలస్తీనా అనుకూల నిరసనలతో అగ్రరాజ్యం అమెరికాలోని యూనివర్సిటీలు అట్టుడుకుతున్నాయి. ఇప్పటికే పలు యూనివర్సిటీలో జరుగుతున్న ఆందోళనలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పలువురు విద్యార్థులను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా విద్యార్థులు యూనివర్సిటీల నుంచి బహిష్కరణకు కూడా గురయ్యారు. అయినా కూడా నిరసనకారుల్లో మార్పు రాలేదు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. ఇజ్రాయెల్‌తో అమెరికా సంబంధాలు తెంచుకునేంత వరకు ఆందోళనలు కొనసాగిస్తామని నిరసనకారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ దగ్గర విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. అంతేకాకుండా భారీ ఎత్తున పోలీస్ బలగాలు కూడా మోహరించాయి. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ భవనానికి అధికారులు తాళం వేశారు.
ఇది కూడా చదవండి: AP High Court: హై కోర్టు కీలక ఆదేశాలు..పిన్నెల్లి సహా ఇతర అభ్యర్థులపై జూన్ 5 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు
Also Read
ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి సంబంధించిన విధానాలను సమీక్షించడానికి విశ్వవిద్యాలయంలో సమావేశం కావాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. వందలాది మంది నిరసనకారులు లోపలికి వెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో యూనివర్సిటీ భవనానికి తాళం వేశారు.
ఇది కూడా చదవండి: Uttar Pradesh: పెళ్లి ఇంట్లో మహిళలు డ్యాన్స్ చేస్తుండగా రెచ్చిపోయిన పోకిరీలు..
అక్టోబర్ 7న హమాస్ హఠాత్తుగా ఇజ్రాయెల్‌పై దాడికి తెగబడింది. కొంత మంది ఇజ్రాయెల్స్‌ను అపహరించుకుని పోయింది. దీంతో ఇజ్రాయెల్ పగతో రగిలిపోయింది. అనంతరం రంగంలోకి దిగిన ఇజ్రాయెల్ సైన్యం.. హమాస్ లక్ష్యంగా దాడులకు పాల్పడింది. గాజా పట్టణాన్ని సర్వనాశనం చేసింది. ప్రస్తుతం రఫా లక్ష్యంగా దాడులు చేస్తూనే ఉంది. ఇప్పటికే ఈ యుద్ధంలో వందలాది మంది పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది నిరాశ్రయులయ్యారు. మరోవైపు ఇజ్రాయెల్‌కు అగ్ర రాజ్యం అమెరికా సంపూర్ణ మద్దతు తెలిపింది. ఇదే పాలస్తీనా విద్యార్థులకు రుచించలేదు. తక్షణమే మద్దతు ఉపసంహరించుకోవాలని అమెరికాలో ఆందోళనలు చేపట్టారు.
ఇది కూడా చదవండి: Thane Explosion: 8కి చేరిన మృతులు.. 60 మందికి గాయాలు
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!