బాలీవుడ్ నటుడు షారూఖ్‌ఖాన్ అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం అహ్మదాబాద్‌లో డీహైడ్రేషన్‌కు గురి కావడంతో కేడీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో షారూఖ్‌ఖాన్‌ను వైద్యులు పరీక్షించాక డిశ్చార్జ్ చేసినట్లు తెలుస్తోంది
పూణెలో ఇద్దరు ఐటీ నిపుణుల మృతికి కారణమైన బాలుడికి గంటల వ్యవధిలోనే బెయిల్ మంజూరు చేయడంపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. మహారాష్ట్రలోనూ బాధిత కుటుంబాలు, ప్రజల నుంచి ఆందోళనలు వ్యక్తం చేయడంతో న్యాయస్థానం దిగొచ్చింది.
రెండ్రోజుల్లో దేశ రాజధాని ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం.. కేంద్రప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఢిల్లీలో నీటి సంక్షోభం సృష్టించేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఢిల్లీ జలవనరుల మంత్రి ఆతిషి ఆరోపించారు.
సార్వత్రిక ఎన్నికల వేళ కర్ణాటక లైంగిక వేధింపుల వ్యవహారం దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనం అయింది. హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పలువురు మహిళలను లైంగికంగా వేధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
సార్వత్రిక ఎన్నికల వేళ కలకత్తా హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే టీచర్ రిక్యూట్మెంట్ రద్దు చేసిన న్యాయస్థానం.. తాజాగా ఓబీసీ సరిఫికెట్లను రద్దు చేస్తూ ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది.
భోజ్‌పురి నటుడు, గాయకుడు పవన్ సింగ్‌పై బుధవారం బీజేపీ సస్పెండ్ వేటు వేసింది. బీహార్‌లో ఎన్డీయే అభ్యర్థికి వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినందుకు కమలం పార్టీ సస్పెండ్ చేసింది.
కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాంధీ జూన్ 2న తెలంగాణకు రానున్నారు. యూపీఏ హయాంలో తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అనంతరం జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పరాజయం పాలైంది.