దేశ వ్యాప్తంగా శనివారం ఆరో విడత ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. అయితే పలు ఈవీఎంలకు బీజేపీ ట్యాగ్లు ఉండడంతో ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అయ్యాయి.
రెండు గ్రూపుల మధ్య జరిగిన గ్యాంగ్‌వార్ హాలీవుడ్ సినిమాను మించిపోయింది. అచ్చం సినిమాలో మాదిరిగానే రెండు గ్రూపులు ఘర్షణకు తలపడ్డాయి. రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొట్టుకోవడం.. ఆరుగురు యువకులు వీరంగం సృష్టించడం..
మహారాష్ట్రలోని పూణెలో గత ఆదివారం ఓ బాలుడు కారుతో ఢీకొట్టి ఇద్దరి యువకుల ప్రాణాలు తీశాడు. అనంతరం నిందితుడికి వెంటనే బెయిల్ రావడం.. తర్వాత దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తం కావడంతో అనంరతం బెయిల్ రద్దైంది.
మే 28 నుంచి కోల్‌కతాలో పోలీసులు 144 సెక్షన్‌ను విధించారు. హింసాత్మక నిరసనలు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం కారణంగా ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడవద్దని 60 రోజుల పాటు పోలీసులు ఆంక్షలు విధించారు.
దాదాపు 24 ఏళ్ల నాటి పరువు నష్టం కేసులో ‘నర్మదా బచావో ఆందోళన్’ ఉద్యమకారిణి మేధా పాట్కర్‌కు గట్టి షాక్ తగిలింది. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు ఆమెను దోషిగా తేల్చింది. ప్రస్తుత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న వీకే. సక్సేనా.. ఆమెపై పరువు నష్టం దావా కేసు వేశారు.
ఆత్మాహుతి దాడిలో మరణించిన 5 మంది చైనీయుల కుటుంబాలకు 2.58 మిలియన్ డాలర్ల పరిహారాన్ని పాకిస్థాన్ ప్రకటించింది. ఈమేరకు పాకిస్థాన్ క్యాబినెట్ ఆర్థిక సమన్వయ కమిటీ (ఈసీసీ) గురువారం నిర్ణయం తీసుకుంది
కంగనా రనౌత్‌పై కాంగ్రెస్ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలు మండీ, హిమాచల్‌ప్రదేశ్‌కే అవమానకరమని.. వారికి ఓటర్లు తగిన సమాధానం చెప్పాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజలకు పిలుపునిచ్చారు.
రఫాపై తక్షణమే దాడులు ఆపాలని ఇజ్రాయెల్‌కు అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశించింది. వెంటనే పాలస్తీనా ప్రజలకు విముక్తి కల్పించాలని సూచించింది. గాజాలో సైనిక కార్యకలాపాలను ఆపేయాలంటూ ఇజ్రాయెల్‌కు ఆదేశిస్తూ తీర్పును జారీ చేయడం ఇదే తొలిసారి.
రెమల్ తుఫాన్ పశ్చిమ బెంగాల్ వైపు దూసుకొస్తోంది. రెమల్ తుఫాను ఆదివారం పశ్చిమ బెంగాల్‌కు చేరుకోనుంది. దీని ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ప్రధాని మోడీ శుక్రవారం హిమాచల్‌ప్రదేశ్ మండీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా చివరి విడతలో జూన్ 1న మండీ నియోజకవర్గానికి పోలింగ్ జరగనుంది.