ప్రతి బూత్‌లో పోలింగ్ ముగిసిన 48 గంటలలోపు పోలైన ఓట్లు/లేదా తిరస్కరించబడిన ఓట్లతో సహా ఓటరు ఓటింగ్ డేటాను విడుదల చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను లోక్‌సభ ఎన్నికల ముగిసే వరకు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఐదు దశల్లో ఓటింగ్ పూర్తయ్యాయని, జూన్ 4న రెండు వారాల్లోపు ఫలితాలు రానున్నాయని కోర్టు వెకేషన్ బెంచ్ పేర్కొంది. దీంతో ఎన్నికల సంఘానికి భారీ ఊరట లభించింది.
ఇది కూడా చదవండి: CS Shantha Kumari: రాష్ట్ర ఆవిర్భావ దినోత్స వేడుకలకు ఈసీ గ్రీన్ సిగ్నల్.. ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
లోక్‌సభ ఎన్నికల వేళ ఓటింగ్‌కు సంబంధించిన తుది సమాచారాన్ని పోలింగ్ కేంద్రాల వారీగా వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మలతో కూడిన వెకేషన్ బెంచ్ దీనిపై విచారణ జరిపింది. అయితే.. పిటిషన్‌ను ప్రస్తుతం పరిగణనలోకి తీసుకునేందుకు న్యాయస్థానం నిరాకరించింది. అలా ప్రచురించేందుకు ఎన్నికల సంఘం భారీ స్థాయిలో మానవ వనరులను సమకూర్చుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. లోక్‌సభ ఎన్నికలు పూర్తైన తర్వాత ఈ అంశంపై సాధారణ బెంచ్ విచారణ చేస్తుందని వెకేషన్ బెంచ్ స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: TS Engineering Counselling: ఇంజినీరింగ్ కాలేజీ ప్రవేశాల కౌన్సెలింగ్ షురూ..
దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే ఐదు దశల పోలింగ్ ముగిసింది. ఆరో విడత శనివారం జరగనుంది. చివరి విడత పోలింగ్ జూన్ 1న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదలకానున్నాయి.
ఇది కూడా చదవండి: Prajwal Revanna Scandal: ప్రజ్వల్ రేవణ్ణ కేసులో కేంద్రం చర్యలు మొదలు.. “షోకాజ్” నోటీసులు జారీ..