ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ ఇంటిపై కాల్పుల కేసులో మరో నిందితుడ్ని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో హర్యానాలోని కర్నాల్‌కు చెందిన 22 ఏళ్ల నవజీత్ సంధూ ప్రాణాలు కోల్పోయాడు. అద్దె విషయంలో జరిగిన గొడవలో హత్యకు గురయ్యాడు.
గత కొద్ది రోజులుగా అమెరికా యూనివర్సిటీలు పాలస్తీనా అనుకూల ఉద్యమాలతో దద్దరిల్లుతున్నాయి. పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనలు, నిరసనలు చేపట్టడంతో పోలీసులు ఉక్కుపాదం మోపారు.
గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మానవత్వం చాటుకున్నారు. రోడ్డుప్రమాదంలో పడి ఉన్న బాధితుడికి దగ్గరుండి సాయం అందించారు. బుధవారం ఘోగోల్ మార్గోలో ఈ ఘటన చోటుచేసుకుంది.
క్షత్రియ సమాజంపై చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి రూపాలా మరోసారి క్షమాపణలు చెప్పారు. క్షత్రియ వర్గానికి చెందిన మాజీ పాలకులను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి క్షమాపణ చెప్పారు.
బ్యాంక్ ఆఫ్ బరోడాపై ఉన్న ఆంక్షలను భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఎత్తివేసింది. దీంతో బ్యాంక్ ఆఫ్ బరోడాకు భారీ ఊరట లభించింది. బాబ్ వరల్డ్ యాప్‌పై ఆంక్షలను ఎత్తివేయాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది.