తెలుగు రాష్ట్రాల సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల జాబితాను ఐఎండీ విడుదల చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఆమ్ ఆద్మీ రాజ్యసభ సభ్యురాలు, మాజీ మహిళా కమిషనర్ స్వాతి మాలివాల్‌పై దాడి కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహయకుడు బిభవ్ కుమార్ జ్యుడీషియల్ కస్టడీని తీస్ హజారీ కోర్టు మరోసారి పొడిగించింది.
నీట్ పేపర్ లీక్‌పై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. విద్యార్థి సంఘాలతో పాటు ఆయా విపక్ష పార్టీలు నిరసనలు, ధర్నాలు చేపడుతున్నారు. కొద్ది రోజులుగా ఈ వివాదం రోజురోజుకు ముదురుతోంది.
కేరళలోని కాలికట్ విమానాశ్రయంలో ఎయిర్ అరేబియా విమానానికి బూటకపు బాంబు బెదిరింపు తీవ్ర కలకలం రేపింది. జూన్ 22, శనివారం ఉదయం కాలికట్ విమానాశ్రయం నుంచి షార్జాకు బయలుదేరిన ఎయిర్ అరేబియా విమానానికి బాంబు బెదిరింపుతో బాంబు డిటెక్షన్ స్క్వాడ్ తనిఖీలు చేసింది.
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు సంబంధించిన భూకబ్జా కేసులో ఈడీ దూకుడు పెంచింది. శుక్రవారం రాంచీలోని భూ వ్యాపారి కమలేష్ కుమార్ ఆవరణలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించింది.
వారంతా విద్యావంతులు.. ఆయా ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నతంగా బ్రతుకుతున్న వారు. ఖరీదైన అపార్ట్మెంట్లో నివసిస్తు్న్నారు. అన్ని బాగున్నా.. గుణమే బాగోలేదు. ఎక్కడా చోటు లేనట్టు.. ఓ పబ్లిక్ స్థలంలో మద్యం సేవిస్తున్నారు. అందుకు సెక్యూరిటీ సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు.
దేశంలో రోజు రోజుకు మహిళలపై దారుణాలు.. ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడో చోట నారీమణులపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. నిర్భయ లాంటి కఠిన చట్టాలు వచ్చినా మృగాళ్లలో మాత్రం ఎలాంటి మార్పులు రావడం లేదు.
అసోంను భారీ వరదలు ముంచెత్తాయి. గత కొద్ది రోజులుగా విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇక కొండచరియలు విరిగిపడి పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి.