అసోంను భారీ వరదలు ముంచెత్తాయి. గత కొద్ది రోజులుగా విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇక కొండచరియలు విరిగిపడి పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి.
గుజరాత్‌లోని వడోదరలో దారుణం జరిగింది. ఓ స్కూల్ వ్యాన్ డ్రైవర్ అతి వేగంతో దూసుకుపోవడంతో డోర్ ఓపెన్ అయి ఇద్దరు విద్యార్థినులు కిందపడి పోయారు. దీంతో ఇద్దరికి గాయాలయ్యాయి. కానీ డ్రైవర్ మాత్రం ఆపకుండా వెళ్లిపోయాడు.
ప్రధాని మోడీకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేఖ రాశారు. రాష్ట్రపతి ఆమోదం పొందిన మూడు క్రిమినల్ చట్టాల అమలును వాయిదా వేయాలని కోరుతూ మమతా బెనర్జీ శుక్రవారం లేఖ రాశారు.
కర్ణాటక రాష్ట్రంలో తెలుగు ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి మరో వివాదంలో చిక్కుకున్నారు. తన భూమిని ఆక్రమించారని ఆరోపిస్తూ ఆమెపై బాలీవుడ్ సింగర్ లక్కీ అలీ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫిర్యాదు కాపీని ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు గురువారం ఢిల్లీ కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. మరికొన్ని గంటల్లో తీహార్ జైలు నుంచి విడుదలవుతారన్న సమయంలో హైకోర్టు రూపంలో మరో షాక్ తగిలింది.
కెనడా ప్రభుత్వం విధించిన నో ఫ్లై జాబితా నుంచి తమ పేర్లు తొలగించాలంటూ ఇద్దరు ఖలిస్థానీ వేర్పాటువాదులు చేసిన అభ్యర్థనను కెనడాలోని ఫెడరల్ కోర్టు ఆఫ్ అప్పీల్ తిరస్కరించింది.
పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓటమితో పాటు పశ్చిమబెంగాల్లో పార్టీ ఘోర వైఫల్యానికి బాధ్యత వహిస్తూ పార్టీ పదవికి ఆయన రాజీనామా చేశారు.
బీజేపీ రాజ్యసభ ఎంపీ జేపీ నడ్డా.. మోడీ 3.0 ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అలాగే కీలకమైన ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం మరియు రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖలను అప్పగించారు.