బీఎస్పీ అధినేత మాయావతి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. మే నెలలో తన వారసుడిగా మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను తొలగించింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో రాజకీయ విమర్శలు శృతిమించడంతో ఈ చర్యలు చేపట్టారు.
నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఇప్పటికే విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు రోడ్డెక్కి ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు చేపడుతున్నారు. కేంద్ర కార్యాలయాలను ముట్టడిస్తున్నారు.
స్కూబా డైవర్‌కు సముద్రంలో భయానక దృశ్యం ఎదురైంది. అప్పటి దాకా సాఫీగా సాగిన ప్రయాణం.. హఠాత్తుగా ఊహించని పరిస్థితి ఎదురైంది. మొత్తానికి బతుకుజీవుడా అంటూ ప్రాణాలతో బయటపడ్డాడు.
అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం రేపాయి. కిరాణా షాపులో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా.. మరో 10 మంది గాయపడ్డారు. అర్కాన్సాస్‌లోని ఫోర్డైస్‌లో శుక్రవారం జరిగింది.
కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తన మంత్రివర్గ సహచరులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరియు ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్కర్లను కలిశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు
దేశంలో ఆయా ప్రాంతాల్లో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు కొన్ని రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుంటే.. మరికొన్ని రాష్ట్రాల్లో హీట్‌వేవ్ పరిస్థితులు కొనసాగుతున్నాయి.
మిస్ కోస్టల్ 2024 కిరీటాన్ని సుస్మితా ఆచార్య కైవసం చేసుకుంది. ఇటీవలే ఈ ఈవెంట్ ఉడిపిలో నిర్వహించారు. ప్రతిభావంతురాలైన సుస్మితా ఆచార్య భరతనాట్యం నృత్యకారిణి కూడా.
జార్ఖండ్‌లోని ఓ పాఠశాలలో అపశృతి చోటుచేసుకుంది. స్కూల్ ట్యాంక్ నుంచి వచ్చిన నీరు తాగి 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రాష్ట్ర రాజధాని రాంచీకి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న లతేహర్ జిల్లాలోని దురులోని అప్‌గ్రేడ్ ప్రైమరీ స్కూల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగియగానే ఆయా రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్ ధరలపై వడ్డన ప్రారంభించాయి. ఇప్పటికే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం పెంచేయగా.. తాజాగా గోవా రాష్ట్రం కూడా అదే జాబితాలో చేరింది.
ప్రముఖ కన్నడ సాహితీవేత్త ‘నాడోజ’ కమల హంపన (88) తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్యం కారణంగా ఆమె కన్నుమూశారు. శనివారం బెంగళూరులోని రాజాజీ నగర్ నివాసంలో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.