టమాటా ధరలు మళ్లీ కొండెక్కాయి. ఆ మధ్య కాలంలో ఆకాశాన్నింటిన ధరలు.. గత కొంతకాలంగా తక్కువ ధరలోనే దొరికాయి. ఎన్నికల సీజన్ వరకు బాగానే ధరలు ఉన్నాయి. అలా ఎలక్షన్స్ ముగిశాయో లేవో.. ధరలకు రెక్కలొచ్చిపడ్డాయి. మార్కెట్‌కు వెళ్లాలంటేనే సామాన్యులు భయపడుతున్నారు. ఇక పేదల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. కొనాలంటేనే ఒకటికి పది సార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఇది కూడా చదవండి: Delhi: నీటి సంక్షోభంపై అతిషి నిరాహాదీక్ష .. సీఎం కేజ్రీవాల్‌కి వ్యతిరేకంగా బీజేపీ నినాదాలు..
ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో కిలో టమాటా రూ.100లకు చేరింది. తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో టమోటా ధరలు మరోసారి పెరిగి కిలో వంద రూపాయలకు చేరుకుంది. వాతావరణ పరిస్థితుల కారణంగా సాగుబడి తగ్గినట్లుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు వ్యాపారులు. టమాటాతో పాటు ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, ఆకు కూరలు, ఇతర కూరగాయల ధరలు కూడా మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: అసెంబ్లీలో పవన్ కల్యాణ్ తొలి ప్రసంగం..
ఇదిలా ఉంటే వర్షాకాలంలో సాగుబడి పెరుగుతుంది. దీంతో ధరలు తగ్గుముఖం పడతాయి. కానీ రుతుపవనాలు ప్రవేశించినా ఇంకా వర్షాలు మాత్రం పడడం లేదు. దీంతో ఆయా రాష్ట్రాల్లో హీట్‌వేవ్ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో కూరగాయల ధరలు మరింత కాలం ఎక్కువగానే ఉండే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Covid-19: కరోనా సోకినా కొందరు ఎందుకు సేఫ్‌గా ఉంటున్నారు..? కారణం తెలిసింది..