నీట్ పేపర్ లీక్‌పై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో శనివారం కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ప్యానెల్ సోమవారం తొలిసారి సమావేశం అవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ మధ్య యువతకు రీల్స్ పచ్చి మరింత ముదిరింది. ఏం చేస్తున్నారో వారికే అర్థం కాక హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. ఇటీవల ఓ యువతి డేంజరస్ స్టంట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
ఇంట్లో ఏం సమస్యలున్నాయో.. ఏమో తెలియదు గానీ కుటుంబ యజమాని కసాయిగా మారిపోయి ఫ్యామిలీ మెంటర్స్‌ను పొట్టనపెట్టుకున్నాడు. అనంతరం అతడు కూడా ప్రాణాలు తీసుకున్నాడు.ఈ దారుణం పంజాబ్‌లో చోటుచేసుకుంది.
సైబర్ మోసాలు రోజు రోజుకు పెచ్చుమీరిపోతున్నాయి. అమాయక వ్యక్తుల్ని టార్గె్ట్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా నోయిడాకు చెందిన ఓ మహిళ ఖాతా నుంచి రూ.1.3 కోట్లు అపహరించారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన రెగ్యులర్ బెయిల్‌పై హైకోర్టు స్టే విధించింది. బెయిల్ వచ్చిన ఆనందం కొన్ని గంటల్లోనే ఆవిరైపోయింది
18వ పార్లమెంట్ సమావేశాలు సోమవారం ప్రారంభం అవుతున్నాయి. 24, 25 తేదీల్లో కొత్తగా ఎన్నికైన ఎంపీలంతా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రొటెం స్పీకర్ ఎంపీల చేత ప్రమాణం చేయించనున్నారు.
రాబోయే ఐదు రోజుల్లో కేరళ, కర్ణాటక, గోవాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఆయా రాష్ట్రాలు వేడి వాతావరణం నుంచి ఉపశమనం పొందాయి.
అరుణాచల్ ప్రదేశ్‌ను భారీ వరదలు ముంచెత్తాయి. మేఘాలకు చిల్లుపడినట్లుగా కుండపోత వర్షం కురిసింది. దీంతో ఇటానగర్‌లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదల్లో పలు ఇళ్లు, వాహనాలు దెబ్బతిన్నాయి.
మహారాష్ట్రలోని పుణెలో రోడ్డుప్రమాదం జరిగింది. యావత్ గ్రామంలోని సహజ్‌పూర్ ఫాటా సమీపంలో రాష్ట్ర రవాణా బస్సు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
ఏదైనా హోటల్‌కు గానీ.. లేదంటే రెస్టారెంట్‌కు గానీ వెళ్లినప్పుడు తాజాగా.. వేడి వేడిగా ఏవైనా ఆహార పదార్థాలు దొరుకుతాయేమోనని ఆశించి వెళ్తుంటాం. తీరా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాక చల్లని ఆహార పదార్థాలు వడ్డిస్తే ఎవరూ ఇష్టపడరు.