Viral video: గురుగ్రామ్ అపార్ట్‌మెంట్‌లో ఘర్షణ.. దేనికోసమంటే..!
- గురుగ్రామ్ అపార్ట్‌మెంట్‌లో ఘర్షణ
- మద్యం సేవించొద్దన్నందుకు గార్డ్సుపై దాడి
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వారంతా విద్యావంతులు.. ఆయా ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నతంగా బ్రతుకుతున్న వారు. ఖరీదైన అపార్ట్‌మెంట్‌లో నివసిస్తు్న్నారు. అన్ని బాగున్నా.. గుణమే బాగోలేదు. ఎక్కడా చోటు లేనట్టు.. ఓ పబ్లిక్ స్థలంలో మద్యం సేవిస్తున్నారు. అందుకు సెక్యూరిటీ సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతే ఏదో పరువు పోయినట్లుగా నివాసితులు రెచ్చిపోయారు. సెక్యూరిటీ సిబ్బందిపై ఎదురు తిరిగారు. కర్రలు, పెద్ద పెద్ద రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇది కూడా చదవండి: Bapatla: ఘోర విషాదం, రామాపురం బీచ్‌లో నలుగురు విద్యార్థులు గల్లంతు
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
గురుగ్రామ్‌లోని సెక్టార్ 95లోని ఆర్‌ఓఎఫ్ ఆనంద సొసైటీ కాంప్లెక్స్ ప్రాంతంలో అపార్ట్‌మెంట్ వాసులు మద్యం సేవిస్తున్నారు. అందుకు సెక్యూరిటీ గార్డులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. కర్రలు, రాళ్లతో దాడుల చేసుకున్నారు. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Life Imprisonment: మైనర్ కుమార్తెపై అత్యాచారం.. తండ్రికి జీవిత ఖైదు..
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలిని పరిశీలించారు. వీడియోలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అపార్ట్‌మెంట్ వాసుల్ని మద్యం సేవించొద్దని చెప్పినందుకు సెక్యూరిటీ గార్డుపై దాడి చేశారని పోలీసులు తెలిపారు. తొలుత వాగ్వాదంతో ప్రారంభమై.. అనంతరం కొట్లాటకు దారి తీసిందని పేర్కొన్నారు. మరొక గార్డు అతని సహోద్యోగిని రక్షించడానికి ప్రయత్నించాడు. దీంతో ఒక నివాసిని కర్రతో కొట్టాడు. నివాసుతులంతా అతని నుంచి కర్రను లాక్కొని బదులుగా అతనిపై దాడి చేశారు. భద్రతా సిబ్బంది తన వాహనాన్ని రివర్స్ చేయడంతో ఒక బైకర్ ఢీకొట్టినట్లుగా వీడియోలో కనిపించింది. సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Video Viral : పట్టపగలే నడిరోడ్డుపై మత్తుమందు ఇచ్చి మహిళ కిడ్నాప్..
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!