తెలుగు రాష్ట్రాల సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల జాబితాను ఐఎండీ విడుదల చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఇది కూడా చదవండి: Lic Plan : ఈ ప్లాన్ లో ఇన్వెస్ట్ చేస్తే నెలకు రూ. 12 వేలు పొందోచ్చు.. ఎలాగంటే?
గోవా, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్‌గఢ్‌తో సహా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, బీహార్, ఒడిశా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అలాగే అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Health: వర్షాకాలంలో జ్వరం, జలుబు రాకుండా ఉండేందుకు ఇవి తీసుకోండి..!
ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు సిక్కిం అతలాకుతలం అయింది. ఇప్పటికే 36 మంది మరణించారని అధికారులు తెలిపారు. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి. కొండచరియలు విరిగిపడి నివాసాలు దెబ్బతిన్నాయి. ఇంకోవైపు అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. దాదాపు 5 లక్షల మంది ప్రజలపై ప్రభావం పడినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Flipkart Minutes Launch Soon: ఇకపై 15 నిమిషాల్లో మీ ఆర్డర్ ఇంటికి వచ్చేస్తుంది..!