Parliament Sessions: సోమ, మంగళవారాల్లో ఎంపీల ప్రమాణం.. స్పీకర్ ఎంపికపై ఉత్కంఠ
- 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం
- సోమ... మంగళవారాల్లో ఎంపీల ప్రమాణం
- 26న స్పీకర్ ఎంపికపై ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
18వ పార్లమెంట్ సమావేశాలు సోమవారం ప్రారంభం అవుతున్నాయి. 24, 25 తేదీల్లో కొత్తగా ఎన్నికైన ఎంపీలంతా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రొటెం స్పీకర్ ఎంపీల చేత ప్రమాణం చేయించనున్నారు. ఇక ప్రొటెం స్పీకర్‌గా సోమవారం రాష్ట్రపతి భవన్‌లో ఒడిశాకు చెందిన భర్తృహరి మహతాబ్ ప్రమాణం చేయనున్నారు. ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించనున్నారు. రెండ్రోజుల పాటు ప్రొటెం స్పీకర్ ఆధ్వర్యంలో ఎంపీలు ప్రమాణం చేయనున్నారు. అనంతరం జూన్ 26న స్పీకర్ ఎన్నిక జరగనుంది.
ఇది కూడా చదవండి: CRIME: ప్రియురాలి సోదరుడితో కలిసి పెళ్ళాన్ని హతమార్చిన భర్త..
Also Read
- Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
- Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
- Guest Habits: గెస్ట్‌గా వెళ్తున్నారా? పిలిచినవారు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలా చేయండి..!
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
అయితే స్పీకర్ పోస్టుకు పోటీ నెలకొంది. ఈ పోస్టును ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాలు ఆశిస్తున్నాయి. కానీ బీజేపీ మాత్రం తన దగ్గరే ఉంచుకోవాలని చూస్తోంది. అయితే రాజమండ్రి బీజేపీ ఎంపీ పురందేశ్వరికి ఈ పదవి దక్కవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరీ ఆ పదవి ఎవరికి దక్కుతుందో చూడాలి.
ఇక జూన్ 24 ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజే దాదాపు 280 మంది లోక్ సభ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్పెషల్ సెషన్ కావడంతో క్వశ్చన్ అవర్ లేదా జీరో అవర్ ఉండదు. తొలుత ప్రధాని మోడీ ప్రమాణం చేశాక సీనియారిటీ ఆధారంగా మంత్రులు, ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది.
అక్షర క్రమంలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉండటంతో ఏపీ నుంచి గెలిచిన ఎంపీలు, తెలంగాణ ఎంపీలు తొలిరోజే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 27న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రసంగిస్తారు. జులై 3వ తేదీ వరకు పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి.
ఇదిలా ఉంటే డిప్యూటీ స్పీకర్ పదవిని ఇండియా కూటమి ఆశిస్తోంది. ఈ పదవి ఇవ్వకపోతే స్పీకర్ పదవికి పోటీ చేస్తామని చెబుతోంది. మరోవైపు ఈసారి కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా సంపాదించింది. ఈ పదవి ఎవరికి దక్కుతుందో చూడాలి.
ఇది కూడా చదవండి: Girl drags Boyfriend to Court: ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని ప్రియుడిని కోర్టుకు లాగిన ప్రియురాలు..
తాజావార్తలు
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
-
Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
-
Trump Iran Statement: ‘త్వరలోనే విజయం సాధిస్తాం’.. ఇరాన్‌తో ఘర్షణపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Guest Habits: గెస్ట్‌గా వెళ్తున్నారా? పిలిచినవారు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలా చేయండి..!
ట్రెండింగ్
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!