ఇంట్లో ఏం సమస్యలున్నాయో.. ఏమో తెలియదు గానీ కుటుంబ యజమాని కసాయిగా మారిపోయి ఫ్యామిలీ మెంటర్స్‌ను పొట్టనపెట్టుకున్నాడు. అనంతరం అతడు కూడా ప్రాణాలు తీసుకున్నాడు.ఈ దారుణం పంజాబ్‌లో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: NTA: నీట్-యూజీ రీ ఎగ్జామ్ పూర్తి.. 1563 మంది అభ్యర్థులకు గానూ.. 813 మంది హాజరు
పంజాబ్‌లోని బర్నాలా జిల్లాలో ఓ వ్యక్తి తల్లి బల్వంత్ కౌర్‌ను, కుమార్తె నిమ్రత్ కౌర్‌ను, పెంపుడు కుక్కను కాల్చి చంపి ఆత్మహత్య చేసుకున్నాడని ఆదివారం పోలీసులు తెలిపారు. శనివారం సాయంత్రం రామరాజ్య కాలనీలోని ఈ ఘటన చోటుచేసుకుంది. కుల్బీర్ మాన్ అనే వ్యక్తి.. తొలుత తన 21 ఏళ్ల కుమార్తెను కాల్చి చంపాడు. అనంతరం అతని 85 ఏళ్ల తల్లిని.. పెంపుడు కుక్కను చంపాడు. అటు తర్వాత కుల్బీర్ మాన్ తన లైసెన్స్ రివాల్వర్‌ను ఉపయోగించి జీవితాన్ని ముగించుకున్నాడని అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Noida: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడ్డ మహిళ.. రూ.1.3 కోట్లు అపహరణ
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సంఘటనాస్థలిని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. అయితే మాన్ దీర్ఘకాలిక డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లుగా ప్రాథమిక పరిశోధనలో తేలిందని పోలీసు అధికారి తెలిపారు. మాన్, ఆయన కుమార్తె ఇటీవల కెనడా నుంచి తిరిగి వచ్చినట్లు గుర్తించారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Police Harassment: ఓ కేసులో పోలీసులు చిత్రహింసలు.. ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య