మరికొద్ది సేపట్లో అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు. మూడు ముళ్ల బంధంతో ఒక్కటవుతున్నారు. ఇందుకోసం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ సిద్ధమైంది. ఇక ఈ వివాహానికి అతిరథ మహరథులంతా పెళ్లి మండపానికి చేరుకుంటున్నారు. ఓ వైపు పెళ్లి సందడి జరుగుతుండగా.. ఇంకోవైపు కాబోయే కోడలు రాధికా మర్చంట్ గురించి అత్తగారు నీతా అంబానీ గతంలో మాట్లాడిన వ్యాఖ్యలు తాజాగా వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Anant ambani wedding: అక్షయ్‌కుమార్‌కు కోవిడ్ పాజిటివ్.. పెళ్లికి హాజరుకాలేకపోతున్న హీరో
గతంలో ఒక వేదికపై నీతా అంబానీ మాట్లాడుతూ.. రాధిక.. అనంత్ అంబానీకి కాబోయే భాగస్వామి మాత్రమే కాదు.. అంబానీ కూతురు కూడా అంటూ సంబోధించారు. రాధిక మా జీవితాల్లో వెలుగు అంటూ ఆమె వ్యాఖ్యానించారు. రాధికను మా ఇంట్లోకి ఆహ్వానిస్తున్నామని చెప్పుకొచ్చారు. రాధిక.. అనంత్‌కు చిరకాల భాగస్వామి అంటూ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పాత వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజా వీడియోతో రాధికతో నీతాకు ఉన్న లోతైన అనుబంధాన్ని గుర్తు చేస్తోంది. డ్యాన్స్‌పై నాకున్న ప్రేమ.. తన కొడుకుపై ఉన్న ప్రేమను పంచే మరో కుమార్తె మాకు కనిపించిందని.. అందుకే రాధికను అంబానీ బేటీగా ముక్తకంఠంతో స్వాగతిస్తున్నట్లు నీతా తెలిపారు.