మరికొద్ది సేపట్లో అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు. మూడు ముళ్ల బంధంతో జంట ఒక్కటవుతున్నారు. ఇందుకోసం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ సిద్ధమైంది. ఈ వివాహానికి దేశ, విదేశాల నుంచి వీవీఐపీలు, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. ముంబై నగరమంతా సందడి.. సందడిగా నెలకొంది.
ఇది కూడా చదవండి: Anant ambani wedding: కొత్త జంటను చూసి భావోద్వేగానికి గురైన ముఖేష్ అంబానీ
ఇదిలా ఉంటే ఈ వివాహానికి హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ నుంచి సినీ గ్లామర్ తళుక్కుమననుంది. ఆయా ఫిల్మ్ ఇండస్ట్రీల నుంచి అతిథులు ఆహ్వానింపబడ్డారు. అయితే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ చివరి నిమిషంలో ఇరాకటంలో పడ్డారు. అనంత్ అంబానీ-రాధిక పెళ్లికి రెడీ అవుతున్న తరుణంలో కరోనా వైరస్‌కు గురయ్యారు. మెడికల్ టెస్టులు చేయగా.. అక్షయ్‌కు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన పెళ్లికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
అక్షయ్‌కుమర్ తన తాజా చిత్రం ‘సర్ఫిరా’ సినిమోను ప్రమోట్ చేసే పనిలో పడ్డారు. ప్రమోషనల్‌లో భాగంగా కొంత మంది సిబ్బంది కోవిడ్‌కు గురయ్యారు. దీంతో అక్షయ్ కుమార్‌కు శుక్రవారం కరోనా పరీక్ష చేయించుకోగా.. పాజిటివ్ అని తేలింది. దీంతో పెళ్లికి సిద్ధపడుతున్న తరుణంలో రిపోర్టు రావడంతో వివాహానికి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు.