IAS Puja khedkar: మరో కొత్త వివాదంలో పూజా.. దొంగను వదిలిపెట్టాలంటూ ఏం చేసిందంటే..!
- మరో కొత్త వివాదంలో ట్రైనీ ఐఏఎస్ పూజా
- దొంగను వదిలిపెట్టాలంటూ పోలీసులకు ఫోన్లో ఒత్తిడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ తాజాగా మరో కొత్త వివాదంలో చిక్కుకున్నారు. తవ్వేకొద్దీ ఆమె బండారం బయటడుతోంది. అధికార దుర్వినియోగానికి పాల్పడి.. వేటు వేయించుకున్న ఆమె.. కొత్త కొత్త చిక్కుల్లో ఇరుక్కుంటోంది. ఇప్పటికే కంటి చూపు, మానసిక వైకల్యంతో పాటు ఓబీసీ సర్టిఫికెట్ విషయంలో నకిలీలు సృష్టించి ఉద్యోగం పొందినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. ఇదిలా ఉంటే తాజాగా నవీ ముంబై పోలీసులు.. మహారాష్ట్ర హోంశాఖకు కీలక రిపోర్టును అందజేశారు. ఈ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూశాయి.
దొంగతనం ఆరోపణలు ఎదుర్కొంటున్న కుటుంబ సభ్యుడ్ని విడుదల చేయాలంటూ పోలీసులపై పూజా ఖేద్కర్ తీవ్ర ఒత్తిడి చేసిందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఆధారాలను రాష్ట్ర ప్రభుత్వానికి అందించినట్లు సమాచారం. పూజా.. మే 18న డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్‌కి ఫోన్ చేసి… దొంగిలించబడిన స్టీల్‌ను రవాణా చేస్తున్నాడని అనుమానిస్తున్న వ్యక్తిని విడిచిపెట్టాలని ఒత్తిడి తీసుకొచ్చింది. ఈశ్వర్ అనే వ్యక్తి నిర్దోషి అని.. అతనిపై వచ్చిన అభియోగాలు చాలా చిన్నవిని ఆమె చెప్పుకొచ్చింది. కానీ పోలీసులు మాత్రం దొంగను విడిచిపెట్టలేదు.
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
2023 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ పూణె జిల్లాకు అసిస్టెంట్ కలెక్టర్‌గా నియమితులయ్యారు. ట్రైనీగా ఉంటూ గొంతెమ్మ కోర్కెలు కోరింది. దీంతో ఆమెపై రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు వెళ్లడంతో పూజా కుటుంబ సభ్యుల ఆగడాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇక ఆమె తల్లి మనోరమా.. అయితే ఒక రైతును తుపాకీతో బెదిరించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అలాగే పూజా వాడిన కారుకి 21 ట్రాఫిక్ ఉల్లంఘన నోటీసులు పెండింగ్‌లో ఉన్నాయని కూడా తేలింది. 27,000 జరిమానా చెల్లించాలని పోలీసులు నోటీసు జారీ చేశారు. ఇక అదనపు కలెక్టర్ అజయ్ మోర్ లేని సమయంలో ఆయన కార్యాలయాన్ని కూడా ఆమె ఉపయోగించారు. ఇక ఆమెపై ఆరోపణలు నిజమని తేలితే ఉద్యోగం పోయే పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాకుండా క్రిమినల్ కేసులు ఎదుర్కొనే దుస్థితి నెలకొంది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!