జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా దాఖలు చేసిన విడాకుల పిటిషన్లో ఆయన భార్య పాయల్ అబ్దుల్లాకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. గతంలో తన భార్యతో విడాకులను కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఓమర్ అబ్దుల్లా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా తిరస్కరించింది.
రాజ్యసభలో ఎన్డీఏకు బలం తగ్గిపోయింది. బిల్లులు ఆమోదం పొందాలంటే ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి ఏర్పడింది. 245 మంది సభ్యులు ఉన్న రాజ్యసభలో.. ఎన్డీఏ సంఖ్య 101కి పడిపోయింది.
ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ కేసులో రోజుకో కొత్త కోణం వెలుగుచూస్తోంది. ఇప్పటికే ఆమె సమర్పించిన మెడికల్ సర్టిఫికెట్లు నకిలీ అని వార్తలు వినిపిస్తుండగా.. కొత్తగా మరో కొత్త కోణం వెలుగుచూసింది. ఆమె చదువుకు సంబంధించిన సర్టిఫికెట్లు కూడా నకిలీవిగా అధికారులు గుర్తించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో అంగరంగ వైభవంగా జరిగింది. మూడు రోజుల పాటు జరిగిన వివాహ వేడుకలు కన్నుల పండుగగా నిలిచిపోయింది. దేశ, విదేశాల నుంచి వచ్చిన అతిరథ మహరథులతో ముంబై నగరం సందడి సందడిగా మారిపోయింది.
దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని జిల్లాలు జలదిగ్భందంలో చిక్కుకుని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లక్షలాది మంది నిరాశ్రయులై.. శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి రికార్డ్ స్థాయిలో దూసుకెళ్లాయి. అంతర్జాతీయంగా ప్రతికూల అంశాలు ఉన్నప్పటికీ సోమవారం మన సూచీలు ఆరంభంలో లాభాలతో ప్రారంభమయ్యాయి. క్రమక్రమంగా పుంజుకుంటూ భారీ లాభాల దిశగా ట్రేడ్ అయ్యాయి.
ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వ్యవహారం మరింత ముదురుతోంది. ఆమె వ్యవహారం ఓ వైపు రచ్చ రచ్చ చేస్తుంటే.. ఇంకోవైపు ఆమె తల్లిదండ్రుల పాత్ర కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2023 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ పూజా.. డ్యూటీలో చేరకముందే.. గొంతెమ్మ కోర్కెలు కోరింది. అధికార దుర్వినియోగానికి పాల్పడింది.
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. గత వారం హస్తిన పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి హేమంత్ పలువురి ప్రముఖలను కలిశారు. ఇక సోమవారం మధ్యాహ్నం ప్రధాని మోడీని కలిశారు.
దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ బైపోల్స్ ఫలితాల్లో ఇండియా కూటమి ఘన విజయం సాధించింది. ఈ మేరకు కూటమి నేతలంతా సంబరాలు చేసుకున్నారు. ఇక ఈ ఫలితాలపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తనదైన శైలిలో స్పందించారు