అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహ వేడుకలో నీతా అంబానీ మెహందీ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఆమె చేతులపై వేసుకున్న చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పురాతన భారతీయ వివాహ సంప్రదాయం ప్రకారం మెహందీలో ప్రియమైన వ్యక్తి పేరును చెక్కించుకున్నారు. అలాగే కుటుంబ సభ్యులందరి పేర్లను ఒకచోట చేర్చే కళారూపం ప్రత్యేకమైన హైలైట్‌గా నిలిచింది. ఇక ఈ డిజైన్‌లో ఆమె అరచేతులపై రాధా-కృష్ణల అందమైన బొమ్మలు.. కొత్త కొత్త జంట అనంత్-రాధికలను సూచిస్తున్నాయి. ఈ ప్రస్తుతం నీతా మెహందీ నెట్టింట వైరల్‌గా మారింది.
ఇక ముంబై వేదికగా జరుగుతున్న అనంత్ అంబానీ-రాధిక వివాహ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. టాలీవుడ్ నుంచి హీరోలు మహేశ్‌బాబు ఫ్యామిలీ, వెంకటేశ్, బాలీవుడ్ నుంచి సల్మాన్‌ఖాన్, షారూఖ్‌ఖాన్ దంపతులు, సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్, హాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.
Drawing inspiration from the age-old Indian wedding tradition of engraving the name of one’s beloved in mehendi, Nita Ambani highlights a unique interpretation of the art form that brings together the names of all her family members.
In this design, a beautiful motif of… pic.twitter.com/2nENJ745sH
— ANI (@ANI) July 12, 2024