కొందరికి పైత్యం బాగా ముదిరి ఏం చేస్తున్నారో వారికే అర్థం కావడం లేదు. తాజాగా హైవేపై ఓ యువకుడు చేసిన డేంజరస్ స్టంట్ భయాందోళనకు గురిచేస్తోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు దుమ్మె్త్తిపోస్తున్నారు.
సౌతిండియాలో తొలి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ కర్ణాటకలో ప్రారంభమైంది. రూ.449 కోట్లతో బెంగళూరులో నిర్మించిన ఫ్లైఓవర్‌ను డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభించారు.
అన్నదాతా సుఖీభవ.. అన్నదాత విజయీభవ అంటారు పెద్దలు. కర్షకుడు.. ఆరుగాలం కష్టపడి.. పండిస్తే.. ప్రజలకు కడుపునిండా అన్నం దొరుకుతుంది. అందుకే రైతేరాజు అన్నారు. అలాంటి అన్నదాతకు కష్టం వస్తే.. కనికరించే నాథుడే లేకుండా పోయాడు. తనకు న్యాయం చేయండి అంటూ కలెక్టరేట్‌కు వచ్చి పొర్లు దండాలు పెట్టినా.. పట్టించుకున్నా పాపాన పోలేదు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
మైనారిటీ మోర్చాపై పశ్చిమబెంగాల్ బీజేపీ సీనియర్ నాయకుడు సువేందు అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మైనారిటీ కమ్యూనిటీ నుంచి మద్దతు లభించలేదని.. అందుకే బీజేపీ సీట్లు గెలవలేకపోయిందన్నారు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం సాయంత్రం 7 గంటలకు బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రధాని.. పార్టీ కార్యాలయానికి వచ్చి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నారు.
మొహర్రం పండుగ రోజున దుబాయ్ యువరాణి షైకా మహ్రా మొహమ్మద్ రషీద్ అల్ మక్తూమ్ సంచలన నిర్ణయం తీసుకుంది. తన భర్త షేక్ మనా బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్‌తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
బీహార్‌లో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రియురాలిని, ఆమె సోదరిని, తండ్రిని అత్యంత దారుణంగా హతమార్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని, అతడి స్నేహితుడ్ని అరెస్ట్ చేశారు. ఈ ఘోరం సరన్ జిల్లాలో చోటుచేసుకుంది.
ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్‌పై మహారాష్ట్ర ప్రభుత్వం మరో యాక్షన్‌కు పూనుకుంది. బుల్డోజర్ చర్య చేపట్టింది. పూణెలోని ఆమె నివాసంలో ఆక్రమణలను అధికారులు తొలగించారు. ఫుట్‌పాత్‌ను ఆక్రమించి చెట్లు, మొక్కలు పెంచారు.
ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తవ్వేకొద్దీ అక్రమాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే అనేక ఆరోపణలు రావడంతో ఆమె శిక్షణ కార్యక్రమాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. అయినా కూడా ఆమెకు సంబంధించిన వివాదాల పరంపర కొనసాగుతూనే ఉంది. రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది.
ఆర్థిక రాజధాని ముంబైలో మరో అద్భుతమైన ప్రాజెక్ట్ ఆవిష్కృతం కాబోతుంది. నగరానికే ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. మొట్టమొదటిసారిగా భూగర్భంలోంచి మెట్రో రైలు వెళ్లేలా ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ పూనుకుంది. ఈ